మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిసిన ఆర్టీసీ కార్మికులు..

దిశ,నిర్మల్ కల్చరల్: ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను విడుదల చేయించేలా కృషిచేయాలని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్రనాయకులు రాష్ట్రమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని కోరారు. గురువారం ఇంద్రకరణ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా టీఎంయూ రాష్ట్రప్రధాన కార్యదర్శి ఏఆర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులకు రావలసిన 6 డి.ఏ.లు, 2 ఇంక్రిమెంట్లు సి.సి.ఎస్.బకాయిలు ప్రభుత్వం దృష్టికితెచ్చి న్యాయం చేయాలని మంత్రిని కోరామన్నారు. ఇక థామస్ […]

Update: 2021-10-14 09:27 GMT

దిశ,నిర్మల్ కల్చరల్: ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను విడుదల చేయించేలా కృషిచేయాలని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్రనాయకులు రాష్ట్రమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని కోరారు. గురువారం ఇంద్రకరణ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా టీఎంయూ రాష్ట్రప్రధాన కార్యదర్శి ఏఆర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులకు రావలసిన 6 డి.ఏ.లు, 2 ఇంక్రిమెంట్లు సి.సి.ఎస్.బకాయిలు ప్రభుత్వం దృష్టికితెచ్చి న్యాయం చేయాలని మంత్రిని కోరామన్నారు.

ఇక థామస్ రెడ్డి అనే వ్యక్తిని గతంలోనే టిఎంయూ ఆర్టీసీసంఘం నుండి తొలిగించామని, అలాంటి వ్యక్తి కనీసం కార్యకర్త కూడా కాకుండా తానే టిఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శినని కాగితాలు తీసుకొచ్చి రవాణాశాఖామంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. హైకోర్టు సైతం థామస్ రెడ్డి కి, యూనియన్ కు ఎలాంటి సంబంధం లేదని తీర్పు నిచ్చిందని స్పష్టంచేశారు. మంత్రిని కలిసినవారిలో పి.వి.ఎస్.రెడ్డి, కె.ఎం.రెడ్డి, డి.కిషన్, తదితరులున్నారు.

Tags:    

Similar News