ఆర్టీఏ సేవలు ప్రారంభం

ఒక్కరోజులోనే రూ. 1.82 కోట్లు ఆదాయం దిశ, న్యూస్‌బ్యూరో : లాక్‌డౌన్ నిబంధనలను సడలించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో అన్ని రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ లైసెన్సుల జారీ లాంటి సేవలు ప్రారంభమైన గురువారమే రవాణా శాఖకు కోటి 82 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. వాహనాల రిజిస్ట్రేషన్లు, ఇతర సేవల కోసం వచ్చిన వారు భౌతిక దూరం పాటించాలన్న నిబంధనను అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లోనూ ఆర్టీఏ అధికారులు పక్కాగా అమలు చేశారు. కార్యాలయంలోకి […]

Update: 2020-05-07 10:39 GMT

ఒక్కరోజులోనే రూ. 1.82 కోట్లు ఆదాయం

దిశ, న్యూస్‌బ్యూరో :
లాక్‌డౌన్ నిబంధనలను సడలించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో అన్ని రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ లైసెన్సుల జారీ లాంటి సేవలు ప్రారంభమైన గురువారమే రవాణా శాఖకు కోటి 82 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. వాహనాల రిజిస్ట్రేషన్లు, ఇతర సేవల కోసం వచ్చిన వారు భౌతిక దూరం పాటించాలన్న నిబంధనను అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లోనూ ఆర్టీఏ అధికారులు పక్కాగా అమలు చేశారు. కార్యాలయంలోకి ప్రవేశించే ముందే ప్రతి ఒక్కరికి థర్మల్ స్క్రీనింగ్ చేసి శానిటైజర్ ఇచ్చేందుకు పటిష్ట ఏర్పాట్లు చేశారు. మాస్కులు ధరిస్తేనే ఆర్టీఏ ఆఫీసుల్లోకి అనుమతించారు. గురువారం ఆర్టీఏ కార్యాలయాల్లో సేవలందిస్తున్న తీరును, కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలను ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఎం.ఆర్.ఎం రావు హైదరాబాద్ ట్రాన్స్‌పోర్ట్ భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్సులో ఎప్పటికప్పుడు సమీక్షించి అధికారులకు తగు సూచనలు చేశారు.

అత్యవసర వస్తువులు రవాణా చేస్తున్న ఇతర రాష్ట్రాల వాహనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా కమిషనర్ అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి రోడ్డు మార్గాన వస్తున్న వలస కార్మికులు, విద్యార్థుల విషయంలో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. ఆర్టీఏ కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి కరోనా సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అందుకు అవసరమైన మాస్కులు, శానిటైజర్లు సిద్ధంగా ఉంచామని కమిషనర్ రావు తెలిపారు.

Tags: telangana, lockdown, rta, commissioner review

Tags:    

Similar News