మూడో ప్రపంచ యుద్ధం రావొచ్చు..

        భవిష్యత్తులో ఏ క్షణమైనా మూడో ప్రపంచ యుద్ధం సంభవించవచ్చునని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్‌‌లోని అహ్మదాబాద్‌లో శనివారం నిర్వహించిన ఓ సమావేశంలో మాట్లాడిన ఆయన ఈ విధంగా స్పందించారు. ప్రపంచంలో హింస, అసంతృప్తి, నేరాలు, అధిపత్య ధోరణి పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రపంచానికి ముప్పు ముంచుకొస్తుందని, ఇప్పటికే రెండు ప్రపంచ యుద్ధాలు ముగిసాయి. మూడోది కూడా త్వరలోనే రావచ్చని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ప్రస్తుతం సాంకేతికత, […]

Update: 2020-02-16 02:58 GMT

భవిష్యత్తులో ఏ క్షణమైనా మూడో ప్రపంచ యుద్ధం సంభవించవచ్చునని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్‌‌లోని అహ్మదాబాద్‌లో శనివారం నిర్వహించిన ఓ సమావేశంలో మాట్లాడిన ఆయన ఈ విధంగా స్పందించారు. ప్రపంచంలో హింస, అసంతృప్తి, నేరాలు, అధిపత్య ధోరణి పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రపంచానికి ముప్పు ముంచుకొస్తుందని, ఇప్పటికే రెండు ప్రపంచ యుద్ధాలు ముగిసాయి. మూడోది కూడా త్వరలోనే రావచ్చని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ప్రస్తుతం సాంకేతికత, విజ్ఞానాన్ని మంచి కోసం కాకుండా ప్రపంచ వినాశనానికి ఉపయోగిస్తున్నారని మోహన్ భగవత్ మండిపడ్డారు. ప్రపంచ జనాభాలో ఎవ్వరూ సంతోషంగా లేరని గుర్తుచేశారు. ఉద్యోగులు,ఉపాధ్యాయులు, యాజమానులు,విద్యార్థులు, కార్మికులు ఇలా అన్నిరంగాల్లోనూ అసంతృప్తి పెల్లుబీకుతోందని, అందుకు గల కారణాలను అన్వేషించాలని ప్రపంచ దేశాలకు హితవు పలికారు.

Tags:    

Similar News