ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎఫెక్ట్ .. మహిళా తహసీల్దార్‌పై వేటు

దిశ, వెబ్‌డెస్క్ : మాజీ ఐఏఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎఫెక్ట్ ఓ మహిళా తహసీల్దార్‌పై పడింది. ప్రవీణ్ కుమార్ స్థాపించిన స్వేరో సంస్థలో ఆమె కీలక భూమిక పోషించడంతోపాటు, ఆయన నిర్వహించే కార్యక్రమాలకు సహకరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నట్లు గుర్తించి ఆమెపై బదిలీ వేటు వేశారు. బుధవారం నల్లగొండ కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ నార్కట్‌పల్లి తహసీల్దార్‌ పొడపంగి రాధపై బదిలీ వేటు వేశారు. ఆమెను పెద్దఅడిశర్లపల్లి మండలానికి […]

Update: 2021-08-11 10:15 GMT

దిశ, వెబ్‌డెస్క్ : మాజీ ఐఏఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎఫెక్ట్ ఓ మహిళా తహసీల్దార్‌పై పడింది. ప్రవీణ్ కుమార్ స్థాపించిన స్వేరో సంస్థలో ఆమె కీలక భూమిక పోషించడంతోపాటు, ఆయన నిర్వహించే కార్యక్రమాలకు సహకరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నట్లు గుర్తించి ఆమెపై బదిలీ వేటు వేశారు. బుధవారం నల్లగొండ కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ నార్కట్‌పల్లి తహసీల్దార్‌ పొడపంగి రాధపై బదిలీ వేటు వేశారు. ఆమెను పెద్దఅడిశర్లపల్లి మండలానికి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఆమె స్థానంలో పెద్దఅడిశర్లపల్లి తహసీల్దార్‌ దేవదాసును నియమించారు. బుధవారం కార్యాలయానికి వచ్చిన తహసీల్దార్‌ రాధ బదిలీ ఉత్తర్వులు వచ్చాయని తెలుసుకుని వెంటనే రిలీవ్‌ అయ్యారు.

తహసీల్దార్ బదిలీకి ఇదే కారణమా..?

పొడపంగి రాధ రెండేళ్లుగా నార్కట్‌పల్లి తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె గత కొంతకాలంగా స్వేరో సంస్థ చేపట్టే కార్యక్రమాల్లో కీలకభూమిక పోషిస్తున్నట్లు సమాచారం. ఈక్రమంలోనే ఈ నెల 4వ తేదీన ప్రవీణ్‌కుమార్‌ నార్కట్‌పల్లికి వచ్చిన సందర్భంగా భోజన ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. అంతేకాక ఖమ్మంలో జరిగిన సమావేశం అనంతరం హైదరాబాద్‌ వెళుతూ మార్గమధ్యలో నార్కట్‌పల్లిలోని ఓ హోటల్‌లో 400మంది కార్యకర్తలతో ప్రవీణ్‌కుమార్‌ సమావేశం కాగా, తహసీల్దార్‌ రాధ అక్కడే ఉన్నట్లు ఇంటలిజెన్స్‌ వర్గాలు ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు సమాచారం. దీంతో పాటు ఈ నెల 8వ తేదీన జరిగిన బీఎస్పీ బహిరంగ సభతో పాటు అంతకుముందు జరిగిన పలు సమావేశాల్లో ఆమె చురుగ్గా పాల్గొన్నదని గుర్తించి, బదిలీ వేటు వేశారని జిల్లాలో చర్చ సాగుతోంది.

Tags:    

Similar News