ఇంటర్నల్ మార్కుల ద్వారా పాస్ చేయించాలి.. RS ప్రవీణ్ కుమార్ డిమాండ్

దిశ, తెలంగాణ బ్యూరో: ఇంటర్  విద్యార్థులకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా ఫస్టియర్​ పరీక్షలు నిర్వహించిందని, వారికి కనీసం ప్రిపేరయ్యే అవకాశం, తగినంత సమయం కూడా ఇవ్వలేదని బీఎస్పీ స్టేట్​ కోఆర్డినేటర్ ​ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్ శనివారం ట్విట్టర్​వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరీక్షల్లో కేవలం 49 శాతం మంది విద్యార్థులే పాసవడం ఆందోళనను కలిగిస్తోందన్నారు. అసలే కొవిడ్ తో ఆర్థికంగా చితికిపోయిన విద్యార్థులపై, పరీక్షల ఫలితాలు తీవ్ర మానసిక ఒత్తిడిని కలిగిస్తున్నాయని అన్నారు. ఇంత హడావిడిగా […]

Update: 2021-12-18 11:58 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఇంటర్ విద్యార్థులకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా ఫస్టియర్​ పరీక్షలు నిర్వహించిందని, వారికి కనీసం ప్రిపేరయ్యే అవకాశం, తగినంత సమయం కూడా ఇవ్వలేదని బీఎస్పీ స్టేట్​ కోఆర్డినేటర్ ​ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్ శనివారం ట్విట్టర్​వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరీక్షల్లో కేవలం 49 శాతం మంది విద్యార్థులే పాసవడం ఆందోళనను కలిగిస్తోందన్నారు. అసలే కొవిడ్ తో ఆర్థికంగా చితికిపోయిన విద్యార్థులపై, పరీక్షల ఫలితాలు తీవ్ర మానసిక ఒత్తిడిని కలిగిస్తున్నాయని అన్నారు. ఇంత హడావిడిగా పరీక్షలు నిర్వహించకూడదని, ప్రిపరేషన్ కు కొంత టైం ఇవ్వాలని అక్టోబర్ లో వేడుకున్నా ప్రభుత్వం విలలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఫెయిలయిన విద్యార్థులను కనీసం ఇంటర్నల్ మార్కుల ద్వారానైనా పాస్ చేయాలని ఆయన డిమాండ్​ చేశారు. చాలా కాలేజీల్లో ఇప్పటికీ కొంత మంది లెక్చరర్లు లేరని, అలాంటప్పుడు పిల్లల చదువులు సజావుగా సాగేదెట్లా అని ప్రశ్నించారు

Tags:    

Similar News