నిజామాబాద్‌లో రూ.లక్షల విలువైన మద్యం పట్టివేత

దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోని ఎస్‌ఆర్ బార్ భవనం సెల్లార్‌లో అక్రమంగా మద్యం నిల్వ ఉందనే సమాచారం మేరకు బుధవారం రాత్రి పోలీసులు దాడులు చేశారు. ఈ తనిఖీల్లో రూ. లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన పట్టణంలోని 4వ టౌన్ పరిధి న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీ ఆర్యానగర్‌లో చోటుచేసుకుంది. లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని బార్లు, వైన్స్ షాపులను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలోనే ఎస్‌ఆర్ బార్‌లోని మద్యాన్ని గుట్టుచప్పుడు […]

Update: 2020-04-15 09:30 GMT

దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోని ఎస్‌ఆర్ బార్ భవనం సెల్లార్‌లో అక్రమంగా మద్యం నిల్వ ఉందనే సమాచారం మేరకు బుధవారం రాత్రి పోలీసులు దాడులు చేశారు. ఈ తనిఖీల్లో రూ. లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన పట్టణంలోని 4వ టౌన్ పరిధి న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీ ఆర్యానగర్‌లో చోటుచేసుకుంది. లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని బార్లు, వైన్స్ షాపులను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఈ క్రమంలోనే ఎస్‌ఆర్ బార్‌లోని మద్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఎక్కువ ధరకు విక్రయించేందుకు యాజమాన్యం ప్రయత్నించింది. విశ్వసనీయ సమాచారం మేరకు సీఐ సత్యనారాయణ, టౌన్ ఎస్ఐ లక్ష్మయ్య తన సిబ్బందితో కలిసి దాడులు చేసి రూ.లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మద్యం నిల్వ చేసిన మధు సుధాకర్ రెడ్డి, అతని కుమారుడు వినీత్ రెడ్డి, డి శ్రీనివాస్ గౌడ్‌పై కేసు నమోదు చేసినట్టు నగర సీఐ వెల్లడించారు.

Tags : rs. lacs of wines cottons, handover by police, nizamabad

Tags:    

Similar News