ఉప్పల్‌లో దారుణం.. రూ.5 లక్షలు చెల్లిస్తేనే మృతదేహం ఇస్తాం..
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కొవిడ్ మహమ్మారి పరిస్థితులను కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ క్యాష్ చేసుకుంటున్నాయి. రోగి కుటుంబ ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోకుండా డబ్బుల కోసం వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే నగరంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల చీకటి కోణాలు వెలుగుచూడటంతో వైద్యారోగ్యశాఖ వాటిపై చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ కొన్ని ఆస్పత్రుల యాజమాన్యాలు ఇంకా బుద్ది మార్చుకోవడం లేదు. కాసుల వేటలో పడి కరోనా రోగుల కుటుంబాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ […]
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కొవిడ్ మహమ్మారి పరిస్థితులను కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ క్యాష్ చేసుకుంటున్నాయి. రోగి కుటుంబ ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోకుండా డబ్బుల కోసం వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే నగరంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల చీకటి కోణాలు వెలుగుచూడటంతో వైద్యారోగ్యశాఖ వాటిపై చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ కొన్ని ఆస్పత్రుల యాజమాన్యాలు ఇంకా బుద్ది మార్చుకోవడం లేదు. కాసుల వేటలో పడి కరోనా రోగుల కుటుంబాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఉప్పల్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది. కరోనా మృతదేహాన్ని అప్పగించాలంటే రూ.5లక్షలు చెల్లించాలని బాధిత కుటుంబాన్ని డిమాండ్ చేశారు. ఈ ఘటన ఉప్పల్‌లోని ఆదిత్య ఆస్పత్రిలో బుధవారం వెలుగుచూసింది. భాస్కర్ అనే యువకుడు ఇటీవల కరోనా బారిన పడటంతో ఆదిత్య ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందడంతో ఆస్పత్రి యాజమాన్యం రూ.5లక్షలు చెల్లిస్తే గానీ డెడ్ బాడీ ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. దీంతో కుటుంబసభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.