ఎరువుల కొనుగోలుకు మార్క్‌ఫెడ్‌కు రూ.500 కోట్లు
దిశ, న్యూస్‌బ్యూరో: ఈ ఏడాది రాష్ట్రంలో ఖరీఫ్, రబీకి కావల్సిన ఎరువుల కొనుగోలుకు మార్క్‌ఫెడ్‌కు ప్రభుత్వం రూ.500 కోట్ల బ్యాంకు గ్యారంటీ ఇచ్చింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రెండు సీజన్లకు కావాల్సిన ఎరువులను ముందే కొనుగోలు చేసి బఫర్ స్టాక్ ఉంచుకోవడానికిగాను మార్క్‌ఫెడ్‌ను ప్రభుత్వం నోడల్ ఏజెన్సీగా నియమించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి బి. జనార్ధన్ రెడ్డి బుధవారం ఉత్వర్వులు జారీ చేశారు. రెండు సీజన్లకు కలిపి ఈ ఏడాది డీఏపీ, యూరియా, కాంప్లెక్స్ […]
దిశ, న్యూస్‌బ్యూరో: ఈ ఏడాది రాష్ట్రంలో ఖరీఫ్, రబీకి కావల్సిన ఎరువుల కొనుగోలుకు మార్క్‌ఫెడ్‌కు ప్రభుత్వం రూ.500 కోట్ల బ్యాంకు గ్యారంటీ ఇచ్చింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రెండు సీజన్లకు కావాల్సిన ఎరువులను ముందే కొనుగోలు చేసి బఫర్ స్టాక్ ఉంచుకోవడానికిగాను మార్క్‌ఫెడ్‌ను ప్రభుత్వం నోడల్ ఏజెన్సీగా నియమించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి బి. జనార్ధన్ రెడ్డి బుధవారం ఉత్వర్వులు జారీ చేశారు. రెండు సీజన్లకు కలిపి ఈ ఏడాది డీఏపీ, యూరియా, కాంప్లెక్స్ ఎరువులు కలిపి 4 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ ఎరువులు కొన్న రోజు నుంచి పంపిణీ చేసే రోజుకు ధరల్లో ఏదైనా మార్పు వస్తే ఆ నష్టాన్ని మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని తెలిపింది. ఎరువుల రవాణా, నిల్వ చేయడం, బీమా అన్ని ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొంది.
Tags: telangana, markfed, fertilizers, procurement, g.o, b.g