తమిళనాడులో ఒక్కరోజు రాత్రే రూ.428 కోట్లు సీజ్ !

దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడులో మరి కొద్దిగంటల్లో పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) అప్రమత్తమై తనిఖీలు చేపట్టింది. ఈ సోదాల్లో ఓటర్లకు పంచేందుకు సిద్ధం చేసిన రూ.225.5 కోట్ల నగదు, రూ.200 కోట్లకుపైగా విలువైన బంగారం, మద్యం, గృహోపకరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గడిచిన 24 గంటల్లో చెన్నై సహా కోయంబత్తూర్, తిరుప్పూర్, కరూర్ తదితర నగరాల్లో అనుమానిత ప్రాంతాల్లో అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. […]

Update: 2021-04-05 11:09 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడులో మరి కొద్దిగంటల్లో పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) అప్రమత్తమై తనిఖీలు చేపట్టింది. ఈ సోదాల్లో ఓటర్లకు పంచేందుకు సిద్ధం చేసిన రూ.225.5 కోట్ల నగదు, రూ.200 కోట్లకుపైగా విలువైన బంగారం, మద్యం, గృహోపకరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

గడిచిన 24 గంటల్లో చెన్నై సహా కోయంబత్తూర్, తిరుప్పూర్, కరూర్ తదితర నగరాల్లో అనుమానిత ప్రాంతాల్లో అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. బృందాలుగా విడిపోయి అధికారులు ఆయా ప్రాంతాల్లో సోదాలు చేయగా రూ.428 కోట్ల సొత్తు పట్టుబడింది.

Tags:    

Similar News