రైతుబంధుకు రూ.333.29 కోట్లు విడుదల

రాష్ట్ర ప్రభుత్వం రైతు పెట్టుబడి సాయం అందించేందుకు చేపట్టిన రైతుబంధు పథకానికి రూ. 333.29 కోట్ల నిధులు విడుదలయ్యాయి. శుక్రవారం వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్థన్‌రెడ్డి పరిపాలనా అనుమతులు జారీ చేశారు. ఈ ఏడాది యాసంగి రైతు బంధు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5100కోట్లు విడుదలకు పరిపాలన అనుమతులు ఇచ్చింది. కాగా ఇప్పటికే రూ.1350.61 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా రూ. 333.29 కోట్ల నిధులు విడుదల చేయడంతో ప్రస్తుతం విడుదలైన నిధులతో కలిపి […]

Update: 2020-03-06 06:55 GMT

రాష్ట్ర ప్రభుత్వం రైతు పెట్టుబడి సాయం అందించేందుకు చేపట్టిన రైతుబంధు పథకానికి రూ. 333.29 కోట్ల నిధులు విడుదలయ్యాయి. శుక్రవారం వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్థన్‌రెడ్డి పరిపాలనా అనుమతులు జారీ చేశారు. ఈ ఏడాది యాసంగి రైతు బంధు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5100కోట్లు విడుదలకు పరిపాలన అనుమతులు ఇచ్చింది. కాగా ఇప్పటికే రూ.1350.61 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా రూ. 333.29 కోట్ల నిధులు విడుదల చేయడంతో ప్రస్తుతం విడుదలైన నిధులతో కలిపి 2019=-20లో రబీ రైతుబంధు పథకానికి రూ.1683.90 కోట్లు విడుదల చేశారు.

tag: rythu bandhu, funds, released, telangana

Tags:    

Similar News