మూడేళ్లలో 1.75 శాతానికి తగ్గిన రూ. 2000 నోట్ల చెలామణి!
దిశ, వెబ్‌డెస్క్: అధిక విలువ కలిగిన రూ. 2,000 నోటు చెలామణి క్రమంగా తగ్గించేందుకు ఆర్‌బీఐ గత రెండేళ్లుగా వీటి ముద్రణ నిలిపేసిందని కేంద్ర సహాయ ఆర్థిక మంత్రి పంకజ్ చౌదరీ అన్నారు. 2018 మార్చి నాటికి మొత్తం 336.3 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది నవంబర్ నాటికి వీటి సంఖ్య 223.3 కోట్లకు తగ్గిందని రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పంకజ్ చౌదరీ పేర్కొన్నారు. మొత్తం చలామణిలో ఉన్న కరెన్సీలో వీటి వాటా 1.75 శాతం […]
దిశ, వెబ్‌డెస్క్: అధిక విలువ కలిగిన రూ. 2,000 నోటు చెలామణి క్రమంగా తగ్గించేందుకు ఆర్‌బీఐ గత రెండేళ్లుగా వీటి ముద్రణ నిలిపేసిందని కేంద్ర సహాయ ఆర్థిక మంత్రి పంకజ్ చౌదరీ అన్నారు. 2018 మార్చి నాటికి మొత్తం 336.3 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది నవంబర్ నాటికి వీటి సంఖ్య 223.3 కోట్లకు తగ్గిందని రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పంకజ్ చౌదరీ పేర్కొన్నారు. మొత్తం చలామణిలో ఉన్న కరెన్సీలో వీటి వాటా 1.75 శాతం మాత్రమేనని, మొత్తం కరెన్సీ విలువలో రూ. 2,000 నోట్ల విలువ 37.26 శాతం నుంచి 15.11 శాతానికి తగ్గినట్టు ఆయన తెలిపారు.
ప్రజల లావాదేవీల డిమాండ్‌ను సులభతరం చేయడానికి ఎంత విలువ ఉన్న నోట్లను ముద్రించాలనే విషయంపై ఆర్‌బీఐ చర్చలు జరిపిన తర్వాత ప్రభుత్వం నిర్ణయిస్తుంది. 2018-19 తర్వాత నుంచి రూ. 2 వేల నోట్ల ముద్రణకు సంబంధించి ఎలాంటి కొత్త ప్రతిపాదన రాలేదని, ఈ కారణంగానే నోట్ల చెలామణి తగ్గిందని ఆయన వివరించారు. కాగా, 2016లో కేంద్ర ప్రభుత్వం రూ. 500, రూ. 1,000 లాంటి పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో రూ. 2,000 నోటును ప్రవేశపెట్టింది. ఆ తర్వాత కొత్త రూ. 500, రూ. 200 నోట్లను చెలామణిలోకి తీసుకొచ్చింది.