కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ.19.35 కోట్ల నష్టపరిహారం
దిశ, తెలంగాణ బ్యూరో : కరోనాతో చనిపోయిన వారికి సర్కార్నష్ట పరిహారాన్ని విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్‌తో మరణించిన వారిలో 3,870 మందికి కేంద్ర ప్రభుత్వం అందించే ఎక్స్‌గ్రేషియాను మంజూరు చేశారు. ఒక్కో మృతుడికి రూ.50 వేల చొప్పున రూ.19.35 కోట్లను అందజేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రాహుల్‌బొజ్జా గురువారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా డెత్ అడిట్కమిటీ నిర్ధారణ ప్రకారం బాధితులను పరిగణలోకి తీసుకున్నట్లు ఆఫీసర్లు పేర్కొన్నారు. రిలీఫ్‌ఫండ్ కోసం […]
దిశ, తెలంగాణ బ్యూరో : కరోనాతో చనిపోయిన వారికి సర్కార్నష్ట పరిహారాన్ని విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్‌తో మరణించిన వారిలో 3,870 మందికి కేంద్ర ప్రభుత్వం అందించే ఎక్స్‌గ్రేషియాను మంజూరు చేశారు. ఒక్కో మృతుడికి రూ.50 వేల చొప్పున రూ.19.35 కోట్లను అందజేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రాహుల్‌బొజ్జా గురువారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా డెత్ అడిట్కమిటీ నిర్ధారణ ప్రకారం బాధితులను పరిగణలోకి తీసుకున్నట్లు ఆఫీసర్లు పేర్కొన్నారు. రిలీఫ్‌ఫండ్ కోసం ఇప్పటికీ దరఖాస్తుచేయని వారు వెంటనే చేయాలని ఆయన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఆప్లై విధానం ఇలా….
కేంద్ర మార్గదర్శకాల ప్రకారం కరోనా మృతుల నష్టపరిహారం రూ.50 వేలను తీసుకునేందుకు ప్రభుత్వం అధికారికంగా అందించే కొవిడ్ డెత్ సర్టిఫికేట్ తప్పనిసరి. ఓడీఎఫ్‌సీ(అఫీషియల్ డాక్యుమెంట్ ఫర్ కోవిడ్ డెత్) పేరిట ప్రత్యేక డాక్యుమెంట్‌ను అందజేస్తారు. దీన్ని తీసుకొని మీ సేవాల్లో రూ.50 వేల పరిహారం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీని కొరకు గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ నుంచి తీసుకున్న రెగ్యులర్డెత్ సర్టిఫికెట్‌తో పాటు పాజిటివ్ రిపోర్ట్ ఉండాలి. ఆ రిపోర్టు లేకపోతే ఆసుపత్రుల్లో చికిత్స పొందిన ఎంసీసీడీ (మెడికల్ సర్టిఫికేషన్ ఆఫ్ కాజ్ ఆఫ్ డెత్) సర్టిఫికేట్‌ను సమర్పించవచ్చు. అదీ లేకపోతే చికిత్స పొందిన సమయంలో తీసుకున్న స్కానింగ్‌లు, టెస్టులు, రిపోర్టులు, మెడికల్ బిల్లులు ఉన్నా దరఖాస్తు చేసుకోవాలి. ఈ మూడింటిలో ఏదో ఒకటి ఉన్నా సరిపోతుంది. ఆ వివరాలను కమిటీ పరిశీలించి ఓడీఎఫ్‌సీని అందిస్తుంది. ఆ తర్వాత మృతుడి కుటుంబ సభ్యుల బ్యాంక్ అకౌంట్ నంబర్, ఇతర ఆధారాలతో నష్ట పరిహారం కోసం రెండో సారి మీసేవలో అప్లై చేయాల్సి ఉంటుంది.