హిస్టరీ క్రియేట్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’ థియేట్రికల్ బిజినెస్
దిశ, సినిమా: జక్కన్న దర్శకత్వంలో వస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 13న రిలీజ్ కానుంది. తారక్ కొమురం భీమ్‌గా, రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌లో హిస్టరీ క్రియేట్ చేసింది. రాజమౌళి హిస్టారిక్ సక్సెస్ మూవీ ‘బాహుబలి 2’ రూ.215 కోట్ల బిజినెస్ చేయగా.. ఆయన దర్శకత్వంలోనే వస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ దాదాపు రూ. 350 కోట్ల బిజినెస్ చేసి రికార్డు సెట్ చేసింది. సౌత్ ఇండస్ట్రీలోని వివిధ ప్రాంతాల […]
దిశ, సినిమా: జక్కన్న దర్శకత్వంలో వస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 13న రిలీజ్ కానుంది. తారక్ కొమురం భీమ్‌గా, రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌లో హిస్టరీ క్రియేట్ చేసింది. రాజమౌళి హిస్టారిక్ సక్సెస్ మూవీ ‘బాహుబలి 2’ రూ.215 కోట్ల బిజినెస్ చేయగా.. ఆయన దర్శకత్వంలోనే వస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ దాదాపు రూ. 350 కోట్ల బిజినెస్ చేసి రికార్డు సెట్ చేసింది.
సౌత్ ఇండస్ట్రీలోని వివిధ ప్రాంతాల నుంచి ఇండింపెండెంట్ డిస్ట్రిబ్యూటర్లు ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌కు రూ.348 కోట్ల డీల్ ఆఫర్ చేశారు. ‘బాహుబలి 2’ రూ.215 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ చేసి ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా.. ఈ రికార్డులు బ్రేక్ చేస్తూ తెలుగు సినిమా చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందంగా మారిపోయింది ‘ఆర్ఆర్ఆర్’. ఈ ఆఫర్ తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ వెర్షన్లకు రాగా, హిందీ వెర్షన్‌ను కమీషన్ ప్రాతిపదికన AA ఫిల్మ్స్ విడుదల చేయనుంది. ఇక విదేశీ హక్కులు ఇప్పటికే ఫార్స్ ఫిల్మ్స్‌కు రూ.70 కోట్లకు అమ్ముడయ్యాయి. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత డివివి దానయ్య.. విడుదలకు ముందే థియేట్రికల్ రైట్స్ అమ్మకం ద్వారా రూ.500 కోట్లకు పైగా లాభపడ్డారని అంచనా.
‘ఆర్ఆర్ఆర్’ థియేట్రికల్ బిజినెస్ :
ఆంధ్రప్రదేశ్ : రూ.165 కోట్లు
నైజాం : రూ.75 కోట్లు
తమిళనాడు : రూ.48 కోట్లు
కర్ణాటక : రూ.45 కోట్లు
కేరళ : రూ.15 కోట్లు
మొత్తం : రూ.348 కోట్లు (సుమారు)