కరోనా ఎఫెక్ట్: 'ఆర్ఆర్ఆర్' అప్‌డేట్ మిస్…

బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘రౌద్రం రణం రుధిరం’ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే అజయ్ దేవగన్ షూటింగ్‌లో పాల్గొన్నారు కూడా. గురువారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ టీం బర్త్ డే విషెస్ చెప్పింది. అపారమైన మంచి మనసున్న మనిషికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ విష్ చేసింది. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ టీంలో మీరు ఒకరు కావడం గర్వంగా ఉందని… మీతో తొలి షెడ్యూల్‌లో […]

Update: 2020-04-02 05:12 GMT

బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘రౌద్రం రణం రుధిరం’ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే అజయ్ దేవగన్ షూటింగ్‌లో పాల్గొన్నారు కూడా. గురువారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ టీం బర్త్ డే విషెస్ చెప్పింది. అపారమైన మంచి మనసున్న మనిషికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ విష్ చేసింది. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ టీంలో మీరు ఒకరు కావడం గర్వంగా ఉందని… మీతో తొలి షెడ్యూల్‌లో పనిచేయడం మరిచిపోలేని అనుభవమని తెలిపింది. మరో అద్భుతమైన ఏడాదితో ముందుకు సాగాలని కోరుకుంటున్నామని తెలిపింది. మీ పుట్టిన రోజు సందర్భంగా ఆర్ఆర్ఆర్ నుంచి ఫస్ట్ లుక్ వీడియో విడుదల చేసి ట్రీట్ ఇవ్వాలనుకున్నామని.. కానీ ప్రస్తుతమున్న కరోనా సంక్షోభం వల్ల మ్యూజిక్, డీఐ పూర్తి చేసే ప్రక్రియలో ఇబ్బంది కలిగిందన్నారు. లాక్ డౌన్ ముగిసిన వెంటనే మీకు అప్ డేట్ అందిస్తామని హామీ ఇచ్చింది మూవీ యూనిట్.

కాగా రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా భీమ్ ఫర్ రామరాజుతో బర్త్ డే ట్రీట్ ఇచ్చింది ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్. ఈ ఫస్ట్ లుక్ వీడియోతో రికార్డులు బ్రేక్ కాగా… చరణ్ ఇంటెన్సివ్ లుక్… తారక్ గ్రిప్పింగ్ వాయిస్… జక్కన్న మార్క్‌కు జనం ఫిదా అయ్యారు. అయితే అజయ్ దేవగన్ బర్త్ డేకు కూడా స్పెషల్ ట్రీట్‌గా వీడియో వచ్చేదే కానీ… కరోనా ఎఫెక్ట్‌తో ఈ అప్ డేట్ మిస్ అయింది.

Tags : RRR, Ajay Devagan, NTR, RamCharan, SSRajamouli, Danayya, DVV

Tags:    

Similar News