సోషల్ మీడియాలో తెగ వైరలవుతోన్న RRR
దిశ, షాద్ నగర్: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్ ఆధిక్యంలో కొనసాగుతుండటంతో ఆయన గెలుపును సూచిస్తూ సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగా RRR పోస్టర్ తెగ వైరల్ అవుతోంది. 2018లో బీజేపీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్.. ఆ తర్వాత దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపొందిన రఘునందన్ రావు.. తాజాగా హుజురాబాద్ గెలుపు దిశలో రాజేందర్ కొనసాగుతుండటంతో ముగ్గురి పేర్లు కూడా ఆర్ అక్షరంతో ప్రారంభం అవుతుండటంతో ‘RRR’ […]
దిశ, షాద్ నగర్: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్ ఆధిక్యంలో కొనసాగుతుండటంతో ఆయన గెలుపును సూచిస్తూ సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగా RRR పోస్టర్ తెగ వైరల్ అవుతోంది. 2018లో బీజేపీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్.. ఆ తర్వాత దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపొందిన రఘునందన్ రావు.. తాజాగా హుజురాబాద్ గెలుపు దిశలో రాజేందర్ కొనసాగుతుండటంతో ముగ్గురి పేర్లు కూడా ఆర్ అక్షరంతో ప్రారంభం అవుతుండటంతో ‘RRR’ పేరు ఏర్పాటు చేసి పోస్ట్ చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.