కరోనా వేళ.. విరాళం ప్రకటించిన రాజస్థాన్ రాయల్స్

దిశ, స్పోర్ట్స్ : దేశంలో కరోనా సెకెండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో ఎంతో మంది కరోనా బారిన పడి ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క చాలా మంది ఇబ్బందులు పడుతుంటే.. బెడ్లు దొరికినా ఆక్సిజన్ లభించక రోగులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో ఇండియాలోని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సరఫరాకు తమ వంతు సాయంగా రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ 1 మిలియన్ డాలర్ల విరాళం ప్రకటించింది. భారత కరెన్సీలో దాదాపు రూ. 7.5 కోట్లకు సమానం. […]

Update: 2021-04-29 07:19 GMT

దిశ, స్పోర్ట్స్ : దేశంలో కరోనా సెకెండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో ఎంతో మంది కరోనా బారిన పడి ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క చాలా మంది ఇబ్బందులు పడుతుంటే.. బెడ్లు దొరికినా ఆక్సిజన్ లభించక రోగులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో ఇండియాలోని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సరఫరాకు తమ వంతు సాయంగా రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ 1 మిలియన్ డాలర్ల విరాళం ప్రకటించింది.

భారత కరెన్సీలో దాదాపు రూ. 7.5 కోట్లకు సమానం. ఆ జట్టు యాజమాన్యం, ఆటగాళ్లు, ఇతర సిబ్బంది కలిపి ఈ మొత్తాన్ని అందిస్తున్నట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇంతకు ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ పేసర్ పాట్ కమిన్స్ 50వేల డాలర్లు, బ్రెట్‌లీ 1 బిట్ కాయిన్ విరాళంగా ఇచ్చారు. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు శ్రీవత్స్ గోస్వామి రూ. 90 వేలు విరాళంగా ఇచ్చాడు.

Tags:    

Similar News