రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లకు పెరిగిన డిమాండ్
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ సంక్షోభం మధ్య ప్రజా రావాణాను ఉపయోగించుకునే విషయంలో ప్రజలు జాగ్రత్త వహించడంతో ద్విచక్ర వాహనాలకు డిమాండ్ పెరిగిందని ఐషర్ మోటార్స్ కంపెనీ తన వార్షిక నివేదికలో తెలిపింది. అనుబంధ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ పెరగడం, రాయల్ ఎన్‌ఫీల్డ్ పట్ల వినియోగదారుల ఆసక్తి పెరిగిందని ఐషర్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ లాల్ తెలిపారు. రాబోయే రోజుల్లో వ్యక్తిగత రవాణా, ద్విచక్ర వాహనాల డిమాండ్ మరింత పెరుగుతుందని అంచనా […]
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ సంక్షోభం మధ్య ప్రజా రావాణాను ఉపయోగించుకునే విషయంలో ప్రజలు జాగ్రత్త వహించడంతో ద్విచక్ర వాహనాలకు డిమాండ్ పెరిగిందని ఐషర్ మోటార్స్ కంపెనీ తన వార్షిక నివేదికలో తెలిపింది. అనుబంధ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ పెరగడం, రాయల్ ఎన్‌ఫీల్డ్ పట్ల వినియోగదారుల ఆసక్తి పెరిగిందని ఐషర్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ లాల్ తెలిపారు. రాబోయే రోజుల్లో వ్యక్తిగత రవాణా, ద్విచక్ర వాహనాల డిమాండ్ మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నట్టు సిద్ధార్థ అభిప్రాయపడ్డారు.
కరోనా నేపథ్యంలో ప్రజలు ప్రజా రావాణాకు కాస్త దూరం జరిగారని, ఇది ద్విచక్ర వాహన పరిశ్రమకు లాభిస్తుందని 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికలో సిద్ధార్థ వెల్లడించారు. తాము కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ రిటైల్ నెట్‌వర్క్‌ను విస్తరించే ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని, అదే సమయంలో సరఫరా వ్యవస్థను మరింత బలపరుచుకునే ప్రయత్నాలు మొదలుపెట్టామని సిద్ధార్థ పేర్కొన్నారు.
డిజిటల్ పరిష్కారాలు, వివిధ రకాల ఆర్థిక పరిష్కారాల దిశగా వెళ్తున్నామని, ప్రస్తుత పరిస్థితుల్లో డిమాండ్‌ను ఉపయోగించుకుంటామనే విశ్వాసం ఉందని ఆయన వెల్లడించారు. ఇక, రాయల్ ఎన్‌ఫీల్డ్ అంతర్జాతీయ కార్యకలాపాలపై స్పందించిన సిద్ధార్థ మిడిల్ వెయిట్ మోటార్ సైకిల్ విభాగాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామని సిద్ధార్థ వివరించారు. ఇప్పటివరకూ అంతర్జాతీయ స్థాయిలో ఉన్న హిమాలయాన్, 650 ట్విన్ మోటార్ సైకిళ్ల సామర్థ్యం బలంగా ఉందని నమ్ముతున్నామని ఆయన తెలిపారు.