RCB జట్టుకు ‘మిస్టర్ 360’ విజయం
దిశ, వెబ్‌డెస్క్: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 33వ మ్యాచ్ ఉత్కంఠ పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. 7 వికెట్ల భారీ తేడాతో విక్టరీ కొట్టింది. ముఖ్యంగా మిడిలార్డర్‌లో వచ్చిన డివిలియర్స్(55*) విన్నింగ్ షాట్ కొట్టి బెంగళూరుకు విజయాన్ని తెచ్చిపెట్టాడు. 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 19.4 ఓవర్లలో 179 పరుగులు చేసింది. దీంతో ఈ సీజన్‌లో మరో విజయాన్ని నమోదు చేసుకుంది. బెంగళూరు ఇన్నింగ్స్: 178 […]
దిశ, వెబ్‌డెస్క్: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 33వ మ్యాచ్ ఉత్కంఠ పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. 7 వికెట్ల భారీ తేడాతో విక్టరీ కొట్టింది. ముఖ్యంగా మిడిలార్డర్‌లో వచ్చిన డివిలియర్స్(55*) విన్నింగ్ షాట్ కొట్టి బెంగళూరుకు విజయాన్ని తెచ్చిపెట్టాడు. 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 19.4 ఓవర్లలో 179 పరుగులు చేసింది. దీంతో ఈ సీజన్‌లో మరో విజయాన్ని నమోదు చేసుకుంది.
బెంగళూరు ఇన్నింగ్స్:
178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు తొలుత తడబడింది. ఓపెనర్ ఆరోన్ ఫించ్ 23 స్కోరు బోర్డు వద్ద 14 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇక ఆ తర్వాత దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ బాల్ టు బాల్ ఆడుతూ వచ్చారు. ఓపెనర్ దేవదత్ 37 బంతుల్లో 35 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వెంటనే కెప్టెన్ కోహ్లీ(43) క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో 102 పరుగుల వద్ద బెంగళూరు టాప్ ఆర్డర్ కుప్పకూలింది.
ఇక మిడిలార్డర్‌లో వచ్చిన ఏబీడివిలియర్స్ రాజస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 360 డిగ్రీస్ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. కేవలం 22 బంతుల్లోనే 1 ఫోర్, 6 సిక్సర్లు కొట్టి ఆకాశమే హద్దుగా ఆడాడు. ఈ రోజే జట్టులోకి వచ్చిన గురుకీరత్ సింగ్ 19 పరుగులతో రాణించాడు. ముఖ్యంగా 19వ ఓవర్‌లోనే 25 పరుగులు రాబట్టిన ఏబీడివిలియర్స్-గురుకీరత్ మ్యాచ్‌ను మలుపుతిప్పారు. ఇక చివరి ఓవర్‌లో పది పరుగులు చేయాల్సి ఉండగా.. నాలుగు బంతుల్లోనే 11 పరుగులు చేశారు. నాలుగో బంతి వేసేటప్పటికీ ఇంకా 5 పరుగులు చేయాల్సి ఉండగా.. ఏబీ డివిలియర్స్ సిక్స్ కొట్టాడు. దీంతో బెంగళూరు స్కోరు 179 నమోదు కావడంతో జట్టు అనూహ్య విజయం సాధించింది.
రాజస్తాన్ ఇన్నింగ్స్:
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్తాన్ జట్టు నుంచి ఓపెనింగ్ వచ్చిన రాబిన్ ఉతప్ప(41) మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 22 బంతుల్లో 7 ఫోర్లు, 1 ఒక సిక్సర్ కొట్టాడు. ఇక బెన్ స్టోక్స్ (15) పరుగులు చేసి క్రిస్ మోరిస్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత కాసేపటికే హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్న రాబిన్ ఉతప్ప చాహల్ వేసిన బంతికి షాట్ ఆడబోయి అతనూ క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన సంజూ శాంసన్ (9) పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. చాహల్ ఓవర్‌లో సిక్స్ కొట్టే ప్రయత్నంలో క్రిస్ మోరిస్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 69 పరుగుల వద్ద రాజస్తాన్ టాప్ ఆర్డర్‌ను కోల్పోయింది.
ఇక మిడిలార్డర్‌లో వచ్చిన స్టీవ్ స్మిత్ (57) పరుగులతో స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. 6 ఫోర్లు, 1 సిక్సర్ కొట్టి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. జోస్ బట్లర్ కూడా బాల్ టు బాల్ రన్స్ చేశాడు. 25 బంతుల్లో 24 పరుగులు చేసి క్రిస్ మోరిస్ ఓవర్‌లోనే క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత స్టీవ్ స్మిత్‌కు రాహుల్ తెవాతియా(19) మంచి భాగస్వామ్యం ఇచ్చాడు. ఇద్దరు కలిసి స్కోరు బోర్డు 200 వైపు తీసుకెళ్లే సమయంలో మోరిస్ మరో సారి షాక్ ఇచ్చాడు. 20వ ఓవర్‌లో స్మిత్‌ను కూడా క్యాచ్ అవుట్ అయ్యేలా చేశాడు. ఇక ఆ తర్వాత వచ్చిన జోఫ్రా ఆర్చర్ 2 పరుగులు చేసి చివరి బంతికి lbw అయ్యాడు. దీంతో నిర్ధిష్ఠ 20 ఓవర్లలో రాజస్తాన్ 177 పరుగులు చేయగలిగింది.
మోరిస్ మాయ చేశాడు:
బెంగళూరు జట్టులో లేట్‌గా ఎంట్రీ ఇచ్చిన క్రిస్ మోరిస్ మంచిగా రాణించాడు. రాజస్తాన్ బ్యాటింగ్ సమయంలో నాలుగు ఓవర్లు వేసిన క్రిస్ మోరిస్ ఏకంగా నాలుగు వికెట్లు తీసుకున్నాడు. బెన్ స్టోక్స్, స్టీవ్ స్మిత్, జోస్ బట్లర్, జోఫ్రా ఆర్చర్ లాంటి కీలక ఆటగాళ్ల వికెట్లు తీసుకున్నాడు. దీనికి తోడు కేవలం 26 పరుగులు మాత్రమే ఇవ్వడం గమనార్హం.
స్కోరు బోర్డు:
Rajasthan Royals Innings: 177-6 (20 Ov)
1. రాబిన్ ఉతప్ప c ఫించ్ b చాహల్ 41(22)
2. బెన్ స్టోక్స్ c డివిలియర్స్ b క్రిస్ మోరిస్ 15(19)
3. సంజూ శాంసన్ c క్రిస్ మోరిస్ b చాహల్ 9(6)
4. స్టీవ్ స్మిత్ (c) c షాబాజ్ అహ్మద్ b క్రిస్ మోరిస్ 57(36)
5. జోస్ బట్లర్ (wk)c నవదీప్ సైని b క్రిస్ మోరిస్ 24(25)
6. రాహుల్ తెవాతియా నాటౌట్ 19*(11)
7. జోఫ్రా ఆర్చర్ 2(3)
ఎక్స్‌ట్రాలు: 10
మొత్తం స్కోరు: 177/6
వికెట్ల పతనం: 50-1 (బెన్ స్టోక్స్, 5.4), 69-2 (రాబిన్ ఉతప్ప, 7.4), 69-3 (సంజూ శాంసన్, 7.5), 127-4 (జోస్ బట్లర్, 15.3),
173-5 (స్టీవ్ స్మిత్, 19.2), 177-6 (జోఫ్రా ఆర్చర్, 19.6).
బౌలర్లు:
వాషింగ్టన్ సుందర్ 3-0-25-0
క్రిస్ మోరిస్ 4-0-26-4
ఇసురు ఉదాన 3-0-43-0
నవదీప్ సైని 4-0-30-0
యూజువేంద్ర చాహల్ 4-0-28-2
షాబాజ్ అహ్మద్ 2-0-18-0
Royal Challengers Bangalore Innings:
1. దేవదత్ పడిక్కల్ c స్టోక్స్ b రాహుల్ తెవాతియా 35(37)
2. ఆరోన్ ఫించ్ c ఉతప్ప b శ్రేయస్ గోపాల్ 14(11)
3. విరాట్ కోహ్లీ (c)c రాహుల్ తెవాతియా b కార్తీక్ త్యాగి 43(32)
4. ఏబీ డివిలియర్స్ నాటౌట్ 55*(22)
5.గురుకీరత్ సింగ్ నాటౌట్ 19*(17).
ఎక్స్‌ట్రాలు: 13
మొత్తం స్కోరు: 179
వికెట్ల పతనం: 23-1 (ఆరోన్ ఫించ్, 3.3), 102-2 (దేవదత్ పడిక్కల్, 12.6), 102-3 (విరాట్ కోహ్లీ, 13.1).
బౌలింగ్:
జోఫ్రా ఆర్చర్ 3.4-0-28-0
శ్రేయస్ గోపాల్ 4-0-32-1
కార్తీక్ త్యాగి 4-0-32-1
జయదేవ్ ఉనాద్కట్ 4-0-46-0
రాహుల్ తివాతెయా 4-0-30-1