షాకింగ్.. అసభ్యకరంగా మహిళల ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ..

దిశ, జవహర్ నగర్: మహిళలను బ్లాక్మెయిల్ చేసిన కేసులో జైల్ ఊచలు లెక్కపెట్టి వచ్చి, మళ్ళీ బాధిత మహిళతో పాటు మరో మహిళను వేధిస్తూ.. తప్పించుకు తిరుగుతున్న రౌడీ షీటర్‌ను అరెస్ట్ చేసిన ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. సీఐ బిక్షపతి రావు తెలిపిన కథనం ప్రకారం.. కార్పొరేషన్ పరిధిలోని సంతోష నగర్‌లో నివాసం ఉంటున్న అరుణ్ కుమార్ త్యాగి (47) 24/7 అంఖెన్ / సత్యకాం యూట్యూబ్ ఛానల్‌ను […]

Update: 2021-09-07 21:43 GMT

దిశ, జవహర్ నగర్: మహిళలను బ్లాక్మెయిల్ చేసిన కేసులో జైల్ ఊచలు లెక్కపెట్టి వచ్చి, మళ్ళీ బాధిత మహిళతో పాటు మరో మహిళను వేధిస్తూ.. తప్పించుకు తిరుగుతున్న రౌడీ షీటర్‌ను అరెస్ట్ చేసిన ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది.

సీఐ బిక్షపతి రావు తెలిపిన కథనం ప్రకారం.. కార్పొరేషన్ పరిధిలోని సంతోష నగర్‌లో నివాసం ఉంటున్న అరుణ్ కుమార్ త్యాగి (47) 24/7 అంఖెన్ / సత్యకాం యూట్యూబ్ ఛానల్‌ను నిర్వహిస్తుండగా, తన కుమారుడు కౌశిల్ త్యాగి‌లు గత కొంత కాలంగా మహిళలతో కలిసి 24/7 ఐ న్యూస్ నిర్వహిస్తున్నారు. తండ్రీకొడుకులు ఇరువురి మధ్య బేధాభిప్రాయాలు రావడంతో గత కొంత కాలంగా కౌశిల్ త్యాగి యూట్యూబ్ ఛానల్ వ్యవహారాలకు దూరమయ్యాడు. అప్పటి నుంచి అదే ఛానల్‌ను నిర్వహిస్తున్న ఓ మహిళపై అరుణ్ కుమార్ త్యాగి పగతో వేధింపులకు గురి చెయ్యడంతో తట్టుకోలేక గత ఏప్రిల్ 12వతేదీ నుంచి ఆమె ఆఫీస్ కు వెళ్లడం మానేసింది.

ఇదే అదనుగా భావించి ఆమె నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానల్ పత్రాలను అడ్డుపెట్టుకుని తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని లేదంటే నీ పరువు తిస్తానంటూ, తన చేతిని తానే కోసుకున్న వీడియో రికార్డును పంపించి ఆమెను బ్లాక్మెయిల్ చేస్తూ వాట్సప్ చేశాడు. దీంతో బాధితురాలు పోలీసులకు చెప్పడం, ఆధారాలు ఋజువుకావడంతో గత జూన్ 28న పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. తిరిగి జూలై 28న బెయిల్ పై విడుదలై మళ్ళీ బాధితురాలి ప్రొఫైల్ ఫోటోలు వీడియోలు ఇతరులకు పంపిస్తూ, బాధితురాలిని వేధిస్తూ తనను పెళ్లి చేసుకోవాలని లేదంటే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడడంతో బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా మరో మహిళను ఫోన్ కాల్స్, అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిస్తూ వేధిస్తుడటంతో అరుణ్ త్యాగి‌పై బాధితురాలు ఈనెల 6న పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో నిందుతున్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిచినట్లు పోలీసులు తెలిపారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పటికే అరుణ్ కుమార్ త్యాగి‌పై 13 కేసులు ఉన్నట్లు సీఐ బిక్షపతి రావు తెలిపారు.

Tags:    

Similar News