చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకున్న శివ్‌నాడార్!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఛైర్మన్ బాధ్యతల నుంచి శివ్‌నాడార్ తప్పుకున్నట్టు సంస్థ ప్రకటించింది. శివ్‌నాడార్ స్థానంలో ఆయన కుమార్తె హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కొత్త ఛైర్‌పర్సన్‌గా రోషిణీ నాడార్ మళోత్రా బాధ్యతలను స్వీకరించనున్నారు. అయితే, కంపెనీ ఎండీగా, ప్రధాన వ్యూహకర్తగా శివ్‌నాడార్ బాధ్యతలను తీసుకోనున్నారు. ప్రస్తుత సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాల అనంతరం రోషిణి ఎంపిక వివరాలను హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రకటించింది. 38 ఏళ్ల రోషిణీ నాడార్ ఇప్పటివరకు హెచ్‌సీఎల్ టెక్ నాన్-ఎగ్జిక్యూటివ్ […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఛైర్మన్ బాధ్యతల నుంచి శివ్‌నాడార్ తప్పుకున్నట్టు సంస్థ ప్రకటించింది. శివ్‌నాడార్ స్థానంలో ఆయన కుమార్తె హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కొత్త ఛైర్‌పర్సన్‌గా రోషిణీ నాడార్ మళోత్రా బాధ్యతలను స్వీకరించనున్నారు. అయితే, కంపెనీ ఎండీగా, ప్రధాన వ్యూహకర్తగా శివ్‌నాడార్ బాధ్యతలను తీసుకోనున్నారు. ప్రస్తుత సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాల అనంతరం రోషిణి ఎంపిక వివరాలను హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రకటించింది. 38 ఏళ్ల రోషిణీ నాడార్ ఇప్పటివరకు హెచ్‌సీఎల్ టెక్ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలను నిర్వహిస్తూ వచ్చారు. అలాగే, హెచ్‌సీఎల్ ఎంటర్‌ప్రైజ్ సీఈవోగా కూడా విధులను నిర్వహిస్తున్నారు. కెలాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ పూర్తి చేసిన రోషిణీ, ఐఐఎఫ్ఎల్ వెల్త్ హూరన్-2019 ర్యాంకింగ్‌లో దేశీయ అత్యంత సంపన్న మహిళల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. రోషిణీ సంపదను రూ. 36,800 కోట్లుగా ఐఐఎఫ్ఎల్ వెల్త్ వెల్లడించింది.