అరుదైన ఘనత సాధించిన హిట్‌మ్యాన్

దిశ, వెబ్‌డెస్క్: భారత స్టార్ ఓపెనర్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. సోమవారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో 56 పరుగులు చేసిన రోహిత్ శర్మ, అంతర్జాతీయ T20లో అత్యధిక పరుగులు చేసిన(3000) మూడో బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు సాధించారు. ఈ మ్యాచ్‌కి ముందు కేవలం 20 పరుగులకు దూరంలో ఉన్న రోహిత్ తనదైన దూకుడు బ్యాటింగ్‌తో హాఫ్ సెంచరీ(56) చేసి 3000 పరుగుల రికార్డును […]

Update: 2021-11-08 11:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత స్టార్ ఓపెనర్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. సోమవారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో 56 పరుగులు చేసిన రోహిత్ శర్మ, అంతర్జాతీయ T20లో అత్యధిక పరుగులు చేసిన(3000) మూడో బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు సాధించారు. ఈ మ్యాచ్‌కి ముందు కేవలం 20 పరుగులకు దూరంలో ఉన్న రోహిత్ తనదైన దూకుడు బ్యాటింగ్‌తో హాఫ్ సెంచరీ(56) చేసి 3000 పరుగుల రికార్డును అందుకున్నాడు. అయితే, అత్యధిక పరుగులు చేసిన జాబితాలో మొదటి స్థానంలో విరాట్ కోహ్లీ(3227) నిలువగా రెండవ స్థానంలో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్తిల్ (3115) నిలిచాడు.

Tags:    

Similar News