Big Rain Alert : తెలంగాణకు బిగ్ రెయిన్ అలర్ట్.. మరో రెండు గంటల్లో పిడుగుల వర్షం

తెలంగాణ(Telangana)లోని పలు జిల్లాలకు బిగ్ రెయిన్ అలర్ట్(Big Rain Alert) ప్రకటించింది వాతావరణ కేంద్రం.

Update: 2025-04-21 10:52 GMT
Big Rain Alert : తెలంగాణకు బిగ్ రెయిన్ అలర్ట్.. మరో రెండు గంటల్లో పిడుగుల వర్షం
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana)లోని పలు జిల్లాలకు బిగ్ రెయిన్ అలర్ట్(Big Rain Alert) ప్రకటించింది వాతావరణ కేంద్రం. రాబోవు రెండు గంటల్లో రాష్ట్ర రాజధాని హైదరాబాద్(Hyderabad) సహ పలు జిల్లాల్లో భారీ పిడుగులతో కూడిన వర్షాలు(Thunder Stroms) పడబోతున్నట్టు హెచ్చరించింది. హైదరాబాద్, మెదక్, ఆసిఫాబాద్, రంగారెడ్డి, మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, మహబూబ్ నగర్, యాదాద్రి భువనగిరిలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్స్ జారీ చేసింది.

వర్షం పడుతున్నప్పుడు పొలాల్లో పని చేసే కూలీలు, రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద నిలబడవద్దని.. సురక్షిత ప్రదేశాలలో ఉండాలని సూచించింది. ఇక ఉత్తర, మధ్య తెలంగాణలో జిలాల్లో సోమవారం సాయంత్రం వరకు ఓ మోస్తరు వర్షాలు(Scattered Storms) కురిసే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు అధికారులు.    

Tags:    

Similar News