రో‘హిట్’ షాట్ మిస్.. కిషన్ డక్కౌట్
దిశ, వెబ్‌డెస్క్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ తొలుత దూకుడుగా ఆడింది. 49 పరుగుల వద్ద భారీ షాట్‌కు యత్నించి డికాక్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత గ్రీజులో కుదురుకున్న రోహిత్ తనదైన శైలిలో భారీ షాట్లు ఆడాడు. ఒకనొక సమయంలో భారీ స్కోర్ చేస్తుందనుకున్న ముంబై జట్టుకు శ్రేయాస్ గోపాల్ బ్రేకులు వేశాడు. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి ముంబైను గట్టి దెబ్బకొట్టాడు. 9వ ఓవర్లో డికాక్ తరహాలోనే రోహిత్ శర్మ […]
దిశ, వెబ్‌డెస్క్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ తొలుత దూకుడుగా ఆడింది. 49 పరుగుల వద్ద భారీ షాట్‌కు యత్నించి డికాక్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత గ్రీజులో కుదురుకున్న రోహిత్ తనదైన శైలిలో భారీ షాట్లు ఆడాడు. ఒకనొక సమయంలో భారీ స్కోర్ చేస్తుందనుకున్న ముంబై జట్టుకు శ్రేయాస్ గోపాల్ బ్రేకులు వేశాడు. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి ముంబైను గట్టి దెబ్బకొట్టాడు.
9వ ఓవర్లో డికాక్ తరహాలోనే రోహిత్ శర్మ కూడా భారీ షాట్‌కు యత్నించి 88 రన్స్ వద్ద శ్రేయాస్ గోపాల్ బౌలింగ్‌లో రాహుల్ తెవాటియాకు క్యాచ్ ఇచ్చి నిరాశపరిచాడు. ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ కూడా శ్రేయాస్ బౌలింగ్‌లో సామ్సన్ కు క్యాచ్ ఇచ్చి డక్కౌట్ గా వెనుదిరిగాడు. తొలుత 10 ఓవర్లలోపే మూడు కీలక వికెట్లు కోల్పోవడం ముంబై జట్టుకు కష్టతరంగానే చెప్పవచ్చు.