ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. సికింద్రాబాద్ రైల్వే ప్లాట్‌ఫామ్‌ల మూసివేత
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ (Secunderabad Railway Station) ఆధునీకరణ పనులు ప్రారంభమవుతోన్న వేళ రైల్వే ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ (Secunderabad Railway Station) ఆధునీకరణ పనులు ప్రారంభమవుతోన్న వేళ రైల్వే ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు 100 రోజుల పాటు స్టేషన్ పరిధిలోని మొత్తం ఆరు ప్లాట్‌ఫామ్‌లను మూసివేస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో దాదాపు 120 రైళ్లను చర్లపల్లి రైల్వే జంక్షన్ (Charlapally Railway Junction), కాచిగూడ (Kachiguda), నాంపల్లి (Nampally) స్టేషన్లకు దారి మళ్లించనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణంలో భాగంగా భారీ స్కై కాంకోర్స్ (Sky Concourse), లిఫ్టులు (Lifts), ఎస్కలేటర్లు (Escalators), ఫుట్‌ఓవర్ బ్రిడ్జ్‌లను నిర్మించననున్నారు. ఇందులో 110 మీటర్ల వెడల్పు, 120 మీటర్ల పొడవుతో నిర్మించనున్న భారీ స్కై కాంకోర్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. అందులో రిటైల్ ఔట్‌లెట్స్, రెస్టారెంట్లు, కియోస్క్‌లు ఏర్పాటు చేయనున్నారు. ముందుగా ప్లాట్‌ఫాం నెం.2–3, 4–5లలో దాదాపు 50 రోజుల పాటు పనులు కొనసాగనున్నాయి. అక్కడ పనులు పూర్తి అయిన వెంటనే నాలుగు ప్లాట్‌ఫామ్స్‌ను పున: ప్రారంభించి ప్రారంభిస్తున్నారు. అనంతరం ప్లాట్‌ఫామ్ నంబర్ 10 వైపు పనులు ప్రారంభిస్తారు.