Antibodies : భారత్‌లోకి యాంటీబాడీ కాక్‌టెయిల్
న్యూఢిల్లీ: ఫార్మా సంస్థ రోచె అభివృద్ధి చేసిన యాంటీబాడీ కాక్‌టెయిల్‌నుభారత్‌లో లాంచ్ చేస్తున్నట్టు రోచె ఇండియా, సిప్లా సోమవారం సంయుక్తంగా ప్రకటించాయి. స్వల్ప నుంచి మధ్యస్థ స్థాయి తీవ్రత గల కొవిడ్ పేషెంట్ల ట్రీట్‌మెంట్ కోసం ఈ డ్రగ్‌ను వినియోగిస్తారు. ఒక్క డోసుకు రూ. 59750 ధర ఉంటుందని సంస్థలు ప్రకటించాయి. భారత్‌లో సిప్లా కంపెనీ వీటిని మార్కెటింగ్ చేయనుంది. యాంటీబాడీ కాక్‌టెయిల్(కాసిరివిమాబ్, ఇండెవిమాబ్) ఫస్ట్ బ్యాచ్ ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిందని, జూన్‌లో రెండో బ్యాచ్ అందుబాటులోకి […]
న్యూఢిల్లీ: ఫార్మా సంస్థ రోచె అభివృద్ధి చేసిన యాంటీబాడీ కాక్‌టెయిల్‌నుభారత్‌లో లాంచ్ చేస్తున్నట్టు రోచె ఇండియా, సిప్లా సోమవారం సంయుక్తంగా ప్రకటించాయి. స్వల్ప నుంచి మధ్యస్థ స్థాయి తీవ్రత గల కొవిడ్ పేషెంట్ల ట్రీట్‌మెంట్ కోసం ఈ డ్రగ్‌ను వినియోగిస్తారు. ఒక్క డోసుకు రూ. 59750 ధర ఉంటుందని సంస్థలు ప్రకటించాయి. భారత్‌లో సిప్లా కంపెనీ వీటిని మార్కెటింగ్ చేయనుంది. యాంటీబాడీ కాక్‌టెయిల్(కాసిరివిమాబ్, ఇండెవిమాబ్) ఫస్ట్ బ్యాచ్ ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిందని, జూన్‌లో రెండో బ్యాచ్ అందుబాటులోకి వస్తుందని ప్రకటన పేర్కొంది.
లక్షల ప్యాక్‌లున్న ఈ బ్యాచ్‌తో రెండు లక్షల మందిని ట్రీట్ చేయవచ్చునని వివరించింది. ఒక్క పేషెంట్‌కు ఇచ్చే డోసు(కంబైన్డ్‌గా 1200 మిల్లీగ్రాముల డోసు- 600 ఎంజీల కాసిరివిమాబ్, 600 ఎంజీల ఇండెవిమాబ్) అందిస్తారని, దీనికి రూ. 59,750(అన్ని పన్నులను కలుపుకుని) ఉంటుందని, మల్టీ డోసు ప్యాక్(ఇద్దరికి ట్రీట్‌మెంట్ ఇవ్వవచ్చు)కు రూ. 1,19,500(పన్నులు సహా) ఉంటుందని పేర్కొంది. ఈ డ్రగ్స్ ప్రధానమైన హాస్పిటళ్లు, కొవిడ్ ట్రీట్‌మెంట్ సెంటర్‌లలో అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఇండియాలో దీనికి సీడీఎస్‌సీవో ఇటీవలే అనుమతినిచ్చింది.