ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణమా ?
దిశ, అబ్దుల్లాపూర్‌మెట్: ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఔటర్ రింగ్‌రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంషాబాద్ నుంచి కోదాడ వైపు వెళ్తున్న కారును వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జు నుజ్జు అయ్యింది. అందులో ఉన్న నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. అత్యవసర చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించే క్రమంలో అక్కడ ఆగివున్న మరో కారును వెనుక నుంచి వచ్చిన మరో వాహనం ఢీకొట్టింది. కారులోని ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో ప్రమాద తీవ్రత […]
దిశ, అబ్దుల్లాపూర్‌మెట్: ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఔటర్ రింగ్‌రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంషాబాద్ నుంచి కోదాడ వైపు వెళ్తున్న కారును వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జు నుజ్జు అయ్యింది. అందులో ఉన్న నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. అత్యవసర చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించే క్రమంలో అక్కడ ఆగివున్న మరో కారును వెనుక నుంచి వచ్చిన మరో వాహనం ఢీకొట్టింది. కారులోని ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో ప్రమాద తీవ్రత తగ్గింది.
ఈ ప్రమాదంలో మొత్తం ఐదుగురికి తీవ్రగాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులందరినీ ఎల్బీనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం, తుర్కయంజాల్, ఆదిబట్ల, పెద్ద అంబర్‌పేట తదితర నగర శివారు ప్రాంతాల్లో దట్టంగా పొగమంచు కురుస్తుండటం, ముందు వచ్చిపోయే వాహనాలు కన్పించకపోవడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు, స్థానికులు చెబుతున్నారు.