కూలి పని చేసుకుని ఇంటికి వెళ్తుండగా.. ఇంతలోనే..

దిశ, కుత్బుల్లాపూర్: రోడ్డు ప్రమాదంలో కూలి మృతి చెందిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా బిక్నూర్ మండలం పొందుర్తి గ్రామానికి చెందిన మేకల నర్సింహులు(31) ఉపాధి కోసం కొంపల్లి సయ్యద్ నగర్ లో ఉండే బంధువు స్వామి వద్దకు వచ్చాడు. కూలి పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నాడు. రోజు మాదిరిగానే శనివారం ఉదయం పని కోసం కొంపల్లి ఎన్సీఎల్ నార్త్ వద్ద నడుచుకుంటూ రోడ్డు దాటుతున్నాడు. […]

Update: 2021-12-18 09:59 GMT

దిశ, కుత్బుల్లాపూర్: రోడ్డు ప్రమాదంలో కూలి మృతి చెందిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా బిక్నూర్ మండలం పొందుర్తి గ్రామానికి చెందిన మేకల నర్సింహులు(31) ఉపాధి కోసం కొంపల్లి సయ్యద్ నగర్ లో ఉండే బంధువు స్వామి వద్దకు వచ్చాడు. కూలి పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నాడు. రోజు మాదిరిగానే శనివారం ఉదయం పని కోసం కొంపల్లి ఎన్సీఎల్ నార్త్ వద్ద నడుచుకుంటూ రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో సుచిత్ర నుండి కొంపల్లి వైపు వేగంగా దూసుకు వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొని తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికంగా గల ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి బంధువు స్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News