ట్రాఫిక్ సిగ్నల్ పోల్‌ను ఢీ కొట్టిన కారు.. ఒకరు మృతి
దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా బీఎన్ రెడ్డి నగర్‌లో కారు బీభత్సం సృష్టించింది. శనివారం తెల్లవారుజామున హస్తినాపురలో ఓ కారు అదుపు తప్పి ట్రాఫిక్ సిగ్నల్ పోల్‌ను ఢీ కొట్టింది. అనంతరం డివైడర్‌పై నుంచి మరో పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుడు ఇబ్రహీంపట్నంకు చెందిన సందీప్‌గా గుర్తించారు. కారు సాగర్ రోడ్ నుంచి ఇబ్రహీంపట్నం వెళ్తుండగా ఈ ప్రమాదం […]
దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా బీఎన్ రెడ్డి నగర్‌లో కారు బీభత్సం సృష్టించింది. శనివారం తెల్లవారుజామున హస్తినాపురలో ఓ కారు అదుపు తప్పి ట్రాఫిక్ సిగ్నల్ పోల్‌ను ఢీ కొట్టింది. అనంతరం డివైడర్‌పై నుంచి మరో పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుడు ఇబ్రహీంపట్నంకు చెందిన సందీప్‌గా గుర్తించారు. కారు సాగర్ రోడ్ నుంచి ఇబ్రహీంపట్నం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో కారు డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసుల కారు డ్రైవర్ గౌతమ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.