ఇంటి నుంచి అదృశ్యమైన యువతి…అనుమానాస్పద స్థితిలో మృతి

ఇంటి నుంచి అదృశ్యమైన మైనర్ బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి ప్రాథమిక సమాచారం మేరకు.

Update: 2024-11-18 10:02 GMT

దిశ, శేరిలింగంపల్లి : ఇంటి నుంచి అదృశ్యమైన మైనర్ బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి ప్రాథమిక సమాచారం మేరకు.. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టేక్ అంజయ్య నగర్ కు చెందిన ఐశ్వర్య (17) ఈనెల 8వ తేదీ నుంచి కనబడకుండా పోయింది. ఆమె తల్లిదండ్రులు అదే రోజు మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన మియాపూర్ పోలీసులు అదృశ్యమైన యువతికి ఉప్పుగూడకు చెందిన ఓ యువకుడితో ఇంస్టాగ్రామ్ లో పరిచయం ఉందని విచారణలో తేలింది. దీంతో విచారణ వేగవంతం చేసిన పోలీసులు అమ్మాయిని తిరిగి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ఐశ్వర్య తుక్కుగూడలోని ఓ ప్లాస్టిక్ కంపెనీ పరిసర ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు గుర్తించారు. మైనర్ అమ్మాయి మిస్సింగ్ కేసులో మియాపూర్ పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News