విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ కల్పించాలి

దిశ, న్యూస్​బ్యూరో: కొవిడ్-19 పరిస్థితుల్లో ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా ఇంటర్నెట్​, ల్యాప్​టాప్​లు అందించాలని ఆర్జేడీ కాంట్రాక్ట్ లెక్చరర్స్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాదె వెంకన్న డిమాండ్​ చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడాన్ని స్వాగతిస్తున్నామని ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. కళాశాలల అడ్మిషన్ షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్రాల మార్గదర్శకాలకు అనుగుణంగా పరిస్థితులు అనుకూలిస్తే భౌతిక దూరాన్ని పాటిస్తూ ప్రత్యక్ష బోధన చేసే […]

Update: 2020-07-26 10:37 GMT

దిశ, న్యూస్​బ్యూరో: కొవిడ్-19 పరిస్థితుల్లో ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా ఇంటర్నెట్​, ల్యాప్​టాప్​లు అందించాలని ఆర్జేడీ కాంట్రాక్ట్ లెక్చరర్స్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాదె వెంకన్న డిమాండ్​ చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడాన్ని స్వాగతిస్తున్నామని ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. కళాశాలల అడ్మిషన్ షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్రాల మార్గదర్శకాలకు అనుగుణంగా పరిస్థితులు అనుకూలిస్తే భౌతిక దూరాన్ని పాటిస్తూ ప్రత్యక్ష బోధన చేసే విధంగా చూడాలన్నారు.

Tags:    

Similar News