ఏం చేయాలో నయన్‌కు తెలుసు : ఆర్జే బాలాజీ

దిశ, వెబ్‌డెస్క్: లేడీ సూపర్ స్టార్ నయనతార ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. ఓ వైపు లేడీ ఓరియంటెడ్ మూవీస్‌ చేస్తూ సూపర్ స్టార్ అనిపించుకుంటూనే, మరోవైపు కమర్షియల్ మూవీస్‌తో గ్లామరస్ టచ్ కూడా ఇస్తోంది. యంగ్ అండ్ సీనియర్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటూ ప్రశంసలు అందుకుంటోంది. ఇక దీపావళి కానుకగా త్వరలో ఓటీటీలో రిలీజ్ కాబోతున్న ‘మూకుతి అమ్మన్(అమ్మోరు తల్లి)’ సినిమాకు సంబంధించి దసరాకు రిలీజైన ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ అందుకుంది. ఆర్జే బాలాజీ డైరెక్ట్ […]

Update: 2020-11-05 06:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: లేడీ సూపర్ స్టార్ నయనతార ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. ఓ వైపు లేడీ ఓరియంటెడ్ మూవీస్‌ చేస్తూ సూపర్ స్టార్ అనిపించుకుంటూనే, మరోవైపు కమర్షియల్ మూవీస్‌తో గ్లామరస్ టచ్ కూడా ఇస్తోంది. యంగ్ అండ్ సీనియర్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటూ ప్రశంసలు అందుకుంటోంది. ఇక దీపావళి కానుకగా త్వరలో ఓటీటీలో రిలీజ్ కాబోతున్న ‘మూకుతి అమ్మన్(అమ్మోరు తల్లి)’ సినిమాకు సంబంధించి దసరాకు రిలీజైన ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ అందుకుంది.

ఆర్జే బాలాజీ డైరెక్ట్ చేస్తూ నటించిన ఈ సినిమాలో నయన్ నటనకు ఆయన బిగ్గెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. నయన్‌తో వర్క్ చేయడం చాలా కంఫర్ట్‌గా ఉంటుందన్న బాలాజీ.. తనొక ప్రొఫెషనల్ యాక్టర్ అని, డైరెక్టర్ విజన్‌ను తెరపై ఆవిష్కరించేందుకు ఏం చేయాలో తనకు తెలుసని అన్నారు. షూటింగ్ షెడ్యూల్ టైమ్‌కు రెండు గంటల ముందే కార్వాన్‌లో ఉంటారని, షూటింగ్ డిలే అయినా సరే.. సహకరిస్తారని తెలిపారు. ఇక సినిమా ఓటీటీ రిలీజ్ విషయానికొస్తే.. దీని గురించి ప్లాన్ ఏమీ లేదని చెప్పారు. కరోనాకు ముందే మూవీ 90 శాతం పూర్తయిందని, థియేటర్స్ ఓపెనింగ్ గురించి వెయిట్ చేయాల్సిన పాయింట్ ఏమీ లేదన్నారు. 2020 సమ్మర్‌లో సినిమా విడుదల కావాల్సి ఉన్నా.. కరోనా వల్ల కుదరలేదన్నారు బాలాజీ.

Tags:    

Similar News