తల్లికి కరోనా సోకితే కడుపులో ఉన్న బిడ్డకు కరోనా సోకుతుందా?

దిశ, వెబ్ డెస్క్ : ఓవైపు కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంటే.., మరోవైపు ఈ వైరస్ గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అనారోగ్యం కారణంగా లేదంటే ఇమ్యూనిటీ పవర్ లేకపోవడం వల్ల కరోనా వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. అదే సమయంలో కరోనా వల్ల గర్భిణీ స్త్రీలకు ప్రమాదం ఉంటుందా..? గర్భిణీ స్త్రీలకు కరోనా సోకితే కడుపులో ఉన్న బిడ్డకు అటాక్ అవుతుందా..? అంటూ అనేక అనుమానాలు తల్లిదండ్రుల్ని ఆందోళనకు గురిచేశాయి. అయితే గర్భిణీ స్త్రీలకు […]

Update: 2020-12-27 21:08 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఓవైపు కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంటే.., మరోవైపు ఈ వైరస్ గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

అనారోగ్యం కారణంగా లేదంటే ఇమ్యూనిటీ పవర్ లేకపోవడం వల్ల కరోనా వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. అదే సమయంలో కరోనా వల్ల గర్భిణీ స్త్రీలకు ప్రమాదం ఉంటుందా..? గర్భిణీ స్త్రీలకు కరోనా సోకితే కడుపులో ఉన్న బిడ్డకు అటాక్ అవుతుందా..? అంటూ అనేక అనుమానాలు తల్లిదండ్రుల్ని ఆందోళనకు గురిచేశాయి. అయితే గర్భిణీ స్త్రీలకు కరోనా సోకితే.., కడుపులో ఉన్న శిశువుకు కరోనా సోకే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.

ఇటీవల సింగపూర్ కు చెందిన ఓ గర్భిణీ మహిళకు కరోనా సోకింది. 20 రోజుల తరువాత వైరస్ తగ్గి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది. అదే మహిళ నేషనల్ యూనివర్సిటీ ఆస్పత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లికి కరోనా సోకింది కాబట్టి పుట్టిన బిడ్డకు కూడా కరోనా సోకుతుందని అందరూ అనుకున్నారు. కానీ విచిత్రంగా మగబిడ్డకు కరోనా సోకలేదు. దీంతో ఆశ్చర్యం వ్యక్తం చేసిన డాక్టర్లు పలు టెస్ట్‌లు చేశారు. ఆ టెస్టుల్లో నవజాత శిశువుకు కరోనాను ఎదుర్కొనే యాంటీబాడీస్ పుష్కలంగా ఉన్నాయని గుర్తించారు. అంతేకాదు ఆయాంటీ బాడీస్ లక్షణాలు సైతం తల్లినుంచి బిడ్డకు అందాయని నిర్ధారించారు.

కాగా గర్భిణీ స్త్రీకి కరోనా సోకితే కడుపులో ఉన్న పిండానికి ఏమైనా ప్రమాదం ఉందా..? అనే అంశంపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్పష్టం చేయలేదు. తాజా సంఘటనతో గర్భిణీ స్త్రీకి కరోనా సోకినా శిశువుకు కరోనా సోకే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ డాక్టర్లు చెబుతున్నారు.

Tags:    

Similar News