వాహనదారులకు షాక్… మరోసారి పెరిగిన పెట్రోల్ ధరలు
దిశ, వెబ్‌డెస్క్: వాహనదారుల జేబులకు చిల్లులు తప్పడం లేదు. రోజురోజుకి పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారుల నడ్డి విరుస్తున్నాయి. పెట్రోల్ ధరలకు అసలు బ్రేకులు పడటం లేదు. గత కొద్దిరోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉండగా.. మంగళవారం కూడా మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 37 పైసలు, డీజిల్‌పై 31 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెంపుతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.102.69కి చేరుకోగా.. లీటర్ డీజిల్ ధర […]
దిశ, వెబ్‌డెస్క్: వాహనదారుల జేబులకు చిల్లులు తప్పడం లేదు. రోజురోజుకి పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారుల నడ్డి విరుస్తున్నాయి. పెట్రోల్ ధరలకు అసలు బ్రేకులు పడటం లేదు. గత కొద్దిరోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉండగా.. మంగళవారం కూడా మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 37 పైసలు, డీజిల్‌పై 31 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెంపుతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.102.69కి చేరుకోగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.20గా ఉంది.
ఇక గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.105.02గా ఉండగా.. డీజిల్ ధర రూ.98.93గా ఉంది. అటు విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.61గా ఉండగా, డీజిల్ ధర రూ. 98.58 గా ఉంది. ఏపీలో అన్ని ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటేసింది.