వామ్మో ధరలు.. తగ్గేదేలేదంటున్న పెట్రోల్ , డీజిల్

దిశ, డైనమిక్ బ్యూరో :  వాహనదారులకు పెరుగుతున్న పెట్రోల్ ధరలు చుక్కలు చూపెడుతున్నాయి. రోజు రోజుకు ఆకాశాన్నంటుతున్న ధరలతో సామాన్యులు సైతం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతర్జాతీయంగా చమురు నిల్వలు పెరగడంతో పెట్రో ధరలు దిగి వస్తాయన్న వార్తలతో ఉపషమనం దొరుకుతుందని భావించారు. కానీ, గురువారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దీంతో డీజిల్ ధర సెంచరీ దాటేసింది. ఈక్రమంలో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ పై 32 పైసలు, డీజిల్ పై 38 పైసలు పెరిగాయి. […]

Update: 2021-10-07 02:26 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : వాహనదారులకు పెరుగుతున్న పెట్రోల్ ధరలు చుక్కలు చూపెడుతున్నాయి. రోజు రోజుకు ఆకాశాన్నంటుతున్న ధరలతో సామాన్యులు సైతం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతర్జాతీయంగా చమురు నిల్వలు పెరగడంతో పెట్రో ధరలు దిగి వస్తాయన్న వార్తలతో ఉపషమనం దొరుకుతుందని భావించారు. కానీ, గురువారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దీంతో డీజిల్ ధర సెంచరీ దాటేసింది. ఈక్రమంలో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ పై 32 పైసలు, డీజిల్ పై 38 పైసలు పెరిగాయి. ఫలితంగా ప్రస్తుతం లీటర్ ధర రూ.107.36, డీజిల్ ధర రూ.100.09కు చేరింది. అంతేకాకుండా విశాఖపట్నంలో పెట్రోల్ పై 30 పైసలు రూ.108.25కు చేరుకోగా.. డీజిల్​పై 37 పైసలు పెరిగి రూ.100.47కు చేరింది.

 

Tags:    

Similar News