క్లిష్ట పరిస్థితుల్లో.. రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ

దిశ, వెబ్‌డెస్క్: మోతేరా స్టేడియం వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ సాధించాడు. మొదటిరోజు ఇంగ్లాండ్‌ను 205 పరుగులకే ఆలౌట్ చేసిన ఇండియా ఉత్సాహంతో బ్యాటింగ్ ప్రారంభించింది. అయితే.. ఇండియాకు ఆరంభంలోనే గట్టి దెబ్బ తగిలింది. అండర్సన్ వేసిన మొదటి బంతికే ఓపెనర్ శుభ్‌మన్ గిల్ వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో ఖాతా తెరవకుండానే ఇండియా ఒక వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వరుసగా పుజారా, విరాట్ కోహ్లీ, […]

Update: 2021-03-05 04:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: మోతేరా స్టేడియం వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ సాధించాడు. మొదటిరోజు ఇంగ్లాండ్‌ను 205 పరుగులకే ఆలౌట్ చేసిన ఇండియా ఉత్సాహంతో బ్యాటింగ్ ప్రారంభించింది. అయితే.. ఇండియాకు ఆరంభంలోనే గట్టి దెబ్బ తగిలింది. అండర్సన్ వేసిన మొదటి బంతికే ఓపెనర్ శుభ్‌మన్ గిల్ వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో ఖాతా తెరవకుండానే ఇండియా ఒక వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వరుసగా పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే వికెట్లను కోల్పోయింది భారత్. అప్పటివరకూ నిలకడగా ఆడిన రోహిత్ శర్మ కూడా 49 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత వెంటనే అశ్విన్ సైతం పెవీలియన్ చేరాడు. ఇక వాషింగ్టన్ సుందర్‌తో కలిసి, రిషబ్ పంత్ స్కోరు బోర్డును మెల్లగా పరుగులు పెట్టిస్తున్నాడు. ప్రస్తుతం క్రీజులో పంత్(51), సుందర్(23) రాణిస్తున్నారు. భారత స్కోరు ఆరు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది.

Tags:    

Similar News