రియా చక్రవర్తి కస్టడీ పొడిగింపు

ముంబయి: బాలీవుడ్ నటి, ఆత్మహత్య చేసుకున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ స్నేహితురాలు రియా చక్రవర్తి జ్యుడిషియల్ కస్టడీని ప్రత్యేక ఎన్‌డీపీఎస్ కోర్టు వచ్చే నెల 6వ తేదీ వరకు పొడిగించింది. ప్రస్తుతం ఆమె ముంబయిలోని బైకుల్లా జైలులో ఉన్నారు. రియాతో పాటు ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి కస్టడీని 6వ తేదీ వరకు పొడిగించింది. వీరిరువురు ప్రత్యేక ఎన్‌డీపీఎస్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ఈ నెల 11న తిరస్కరించిన సంగతి తెలిసిందే. తాజాగా, వీరిరువురు […]

Update: 2020-09-22 05:09 GMT

ముంబయి: బాలీవుడ్ నటి, ఆత్మహత్య చేసుకున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ స్నేహితురాలు రియా చక్రవర్తి జ్యుడిషియల్ కస్టడీని ప్రత్యేక ఎన్‌డీపీఎస్ కోర్టు వచ్చే నెల 6వ తేదీ వరకు పొడిగించింది. ప్రస్తుతం ఆమె ముంబయిలోని బైకుల్లా జైలులో ఉన్నారు. రియాతో పాటు ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి కస్టడీని 6వ తేదీ వరకు పొడిగించింది. వీరిరువురు ప్రత్యేక ఎన్‌డీపీఎస్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ఈ నెల 11న తిరస్కరించిన సంగతి తెలిసిందే.

తాజాగా, వీరిరువురు న్యాయవాదుల ద్వారా బాంబే హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయించారు. జస్టిస్ సారంగ్ వీ కోత్వాల్ నేతృత్వంలోని ధర్మాసనం వీరి బెయిల్ పిటిషన్లను రేపు విచారించనుంది. సుశాంత్ సింగ్ ఆత్మహత్యానంతరం మనీలాండరింగ్ కోణంలో విచారిస్తున్న ఈడీ రియా చక్రవర్తి వాట్సాప్ చాట్‌ను సేకరించింది. ఇందులో డ్రగ్స్‌కు సంబంధించిన సంభాషణ కనిపించగానే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ)ని విచారించాల్సిందిగా ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారిస్తూ ఎన్‌సీబీ సుమారు 18 మందిని అరెస్టు చేసింది.

Tags:    

Similar News