నాగ్.. ఇలా ఎలా? : ఆర్జీవీ

చాలా మంది హీరోలు అనుకుంటుంటారు.. కింగ్ నాగార్జున అసలు ఎలాంటి డైట్ ఫాలో అవుతున్నాడని? ఏం చేస్తే మనం అంత హ్యాండ్సమ్‌గా ఉండొచ్చని? అంతేకాదు, చాలా మంది ఈ క్వశ్చన్‌ను నాగ్‌నే ఓపెన్‌గా అడిగిన సందర్భాలున్నాయి. ఇక తన కొడుకులు నాగ చైతన్య, అఖిల్‌కు బ్రదర్‌లా కనిపించే నాగ్.. శనివారం 61వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. కానీ ఆయన మాత్రం ఇప్పటికీ కుర్రాడిలాగే కనిపిస్తారన్న విషయం తెలిసిందే. https://twitter.com/RGVzoomin/status/1299607948180615169?s=19 ఇదే విషయం గురించి ప్రశ్నిస్తూ నాగ్‌కు బర్త్‌డే విషెస్ […]

Update: 2020-08-29 03:22 GMT

చాలా మంది హీరోలు అనుకుంటుంటారు.. కింగ్ నాగార్జున అసలు ఎలాంటి డైట్ ఫాలో అవుతున్నాడని? ఏం చేస్తే మనం అంత హ్యాండ్సమ్‌గా ఉండొచ్చని? అంతేకాదు, చాలా మంది ఈ క్వశ్చన్‌ను నాగ్‌నే ఓపెన్‌గా అడిగిన సందర్భాలున్నాయి. ఇక తన కొడుకులు నాగ చైతన్య, అఖిల్‌కు బ్రదర్‌లా కనిపించే నాగ్.. శనివారం 61వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. కానీ ఆయన మాత్రం ఇప్పటికీ కుర్రాడిలాగే కనిపిస్తారన్న విషయం తెలిసిందే.

https://twitter.com/RGVzoomin/status/1299607948180615169?s=19

ఇదే విషయం గురించి ప్రశ్నిస్తూ నాగ్‌కు బర్త్‌డే విషెస్ చెప్పాడు రామ్ గోపాల్ వర్మ. ‘నాగ్ నువ్వు ఏం తింటున్నావో తెలియదు.. ఏ దేవుడిని పూజిస్తున్నావో తెలియదు.. ఇంకా ఏమైనా చేస్తున్నావో తెలియదు కానీ.. ప్రతీ పుట్టినరోజుకు మరింత యంగ్‌గా తయారవుతున్నావు. ఇలా అయితే నువ్వు ఎప్పటికీ జీవిస్తూనే ఉంటావ్! అని చెప్తూ బెస్ట్ విషెస్ అందించాడు ఆర్జీవీ. కింగ్ ఎప్పటికీ కింగ్‌లా ఉండాలని కోరుకున్నారు.

Tags:    

Similar News