ప్రశాంత్ ముందు రాజమౌళి పనికే రాడు: ఆర్జీవీ

దిశ, వెబ్ డెస్క్: ఆర్జీవీ ఎప్పుడు? ఎలా? ఎవరిని పొగిడేస్తాడో.. ఎప్పుడు? ఎలా? ఎవరిని పాతాళానికి తొక్కేసేలా ప్లాన్ చేస్తాడో… ఎవరూ చెప్పలేరు. ఈ క్రమంలో ఎప్పటిలాగే జక్కన్న సినిమాలను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేసిన రామ్ గోపాల్ వర్మ.. RRR, బాహుబలి సినిమాలతో పోలుస్తూ కన్నడ ఇండస్ట్రీ‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో యశ్‌ను పొగుడుతూ ఆకాశానికి ఎత్తేశారు. https://twitter.com/RGVzoomin/status/1349946519231762433?s=19 రెండేళ్ల క్రితం వరకు బాలీవుడ్‌తో పాటు సౌత్ […]

Update: 2021-01-15 03:41 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆర్జీవీ ఎప్పుడు? ఎలా? ఎవరిని పొగిడేస్తాడో.. ఎప్పుడు? ఎలా? ఎవరిని పాతాళానికి తొక్కేసేలా ప్లాన్ చేస్తాడో… ఎవరూ చెప్పలేరు. ఈ క్రమంలో ఎప్పటిలాగే జక్కన్న సినిమాలను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేసిన రామ్ గోపాల్ వర్మ.. RRR, బాహుబలి సినిమాలతో పోలుస్తూ కన్నడ ఇండస్ట్రీ‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో యశ్‌ను పొగుడుతూ ఆకాశానికి ఎత్తేశారు.

https://twitter.com/RGVzoomin/status/1349946519231762433?s=19

రెండేళ్ల క్రితం వరకు బాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండస్ట్రీ కూడా కన్నడ పరిశ్రమను లెక్కలోకి తీసుకోలేదని.. కానీ, ప్రశాంత్ నీల్, యశ్ కన్నడ ఇండస్ట్రీ అంటే ఏంటో ప్రపంచానికి చూపించారని ఖుదోస్ చెప్పాడు. కేజీఎఫ్ 2 ను వరల్డ్ మ్యాప్‌లో ఉంచినందుకు గాను ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశాడు.

బాహుబలి 2 ట్రైలర్ మూడేళ్లలో 11 కోట్ల వ్యూస్.. RRR టీజర్ మూడు నెలల్లో 3.8 కోట్ల వ్యూస్ సాధిస్తే.. కేవలం మూడు రోజుల్లోనే కేజీఎఫ్ చాప్టర్ 2 టీజర్ 2.14 కోట్ల వ్యూస్ సాధించిందని.. ఈ రికార్డు కన్నడిగుల తరఫున ప్రశాంత్ నీల్ ఇతర ఇండస్ట్రీలకు ఇచ్చిన స్టమక్ పంచ్ అన్నాడు. శాండల్ వుడ్‌ను ప్రపంచ స్థాయిలో నిలబెట్టారు అని మెచ్చుకున్నాడు ఆర్జీవీ. మొత్తానికి ప్రశాంత్ నీల్ పని తనం ముందు రాజమౌళి అసలు పనికిరాడని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పడంతో పాటు కన్నడ ఇండస్ట్రీని చూసి ఎలా పనిచేయాలో నేర్చుకోమని ఇతర ఇండస్ట్రీలకు హితోపదేశం చేశాడు వర్మ

Tags:    

Similar News