కరోనాపై మంత్రి హరీశ్‌రావు సమీక్ష
దిశ, మెదక్: అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో గురువారం ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్, అడిషనల్ కలెక్టర్ ముజంబీల్ ఖాన్ తదితరులతో మంత్రి హరీశ్‌రావు సమీక్షా సమావేశం జరిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎవరికి దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు తీవ్రస్థాయిలో ఉంటే వారిని […]
దిశ, మెదక్: అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో గురువారం ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్, అడిషనల్ కలెక్టర్ ముజంబీల్ ఖాన్ తదితరులతో మంత్రి హరీశ్‌రావు సమీక్షా సమావేశం జరిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎవరికి దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు తీవ్రస్థాయిలో ఉంటే వారిని వెంటనే ఐసోలేషన్‌కు తరలించాలన్నారు. గజ్వేల్ పట్టణంతోపాటు గాజులపల్లి, అహ్మద్‌నగర్, మాదన్నపేట గ్రామాలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. ఇంటింటి సర్వే చేపట్టి గ్రామాలలో ప్రతి వ్యక్తి నివేదికను తయారు చేయాలని మంత్రి సూచించారు. ఆయా గ్రామాలలో ఎవరిని బయటకు రాకుండా వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులను ఏర్పాటు చేయాలన్నారు. మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు సమావేశంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, కమిషనర్, అడిషనల్ కలెక్టర్ తదితర అధికారులు అప్రమత్తమయ్యారు. గజ్వేల్ పట్టణంలో పాజిటివ్ వచ్చిన వ్యక్తి పర్యటించిన పలు గ్రామాలలో చేపడుతున్న చర్యలను పరిశీలించారు.
Tags: Minister Harish Rao, Review, kotha prabhakar reddy, prathap reddy, gajwel