తగ్గిన శిశు మరణాలు.. ఎస్ఆర్ఎస్ సర్వే నివేదికలో వెల్లడి

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో శిశు మరణాలు తగ్గుతున్నాయని ఎస్​ఆర్​ఎస్​(శాంపిల్​ రిజిస్ట్రేషన్​ సిస్టం)సర్వేలో పేర్కొన్నారు. 2018లో పుట్టిన ప్రతీ వెయ్యి మందిలో 27 మంది శిశువులు మరణించగా, 2019కి అది 23కి తగ్గినట్లు పొందుపరిచారు. దేశ వ్యాప్తంగా సగటు ఐఎంఆర్​(మాతశిశుమరణాల రేట్​) 30 ఉండగా, మన దగ్గర అంతకన్న తక్కువే తేలినట్టు వివరించారు. కేవలం ఒక్క సంవత్సరంలోనే 4 పాయింట్లు తగ్గినట్టు సర్వేలో స్పష్టం చేశారు. అత్యధిక ఐఎంఆర్​మధ్యప్రదేశ్​ లో 46 ఉండగా, అతి తక్కువగా మిజోరం […]

Update: 2021-10-28 10:56 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో శిశు మరణాలు తగ్గుతున్నాయని ఎస్​ఆర్​ఎస్​(శాంపిల్​ రిజిస్ట్రేషన్​ సిస్టం)సర్వేలో పేర్కొన్నారు. 2018లో పుట్టిన ప్రతీ వెయ్యి మందిలో 27 మంది శిశువులు మరణించగా, 2019కి అది 23కి తగ్గినట్లు పొందుపరిచారు. దేశ వ్యాప్తంగా సగటు ఐఎంఆర్​(మాతశిశుమరణాల రేట్​) 30 ఉండగా, మన దగ్గర అంతకన్న తక్కువే తేలినట్టు వివరించారు. కేవలం ఒక్క సంవత్సరంలోనే 4 పాయింట్లు తగ్గినట్టు సర్వేలో స్పష్టం చేశారు. అత్యధిక ఐఎంఆర్​మధ్యప్రదేశ్​ లో 46 ఉండగా, అతి తక్కువగా మిజోరం లో కేవలం 3 నమోదైంది. ఇక ఆంధ్రప్రదేశ్​లో 25 ఉండగా, అస్సాంలో 40, గుజరాత్​ లో 25, ఢిల్లీలో 11, కేరళలో 6, తమిళనాడులో 15, ఉత్తర ప్రదేశ్​ లో 41, ఓరిస్సాలో 38, మహరాష్ట్రలో 17, కర్ణాటకలో 21 బీహార్​ లో 29 చొప్పున రికార్డు అయినట్లు ఎస్​ఆర్​ఎస్​లో వివరించారు.

ఎలా సాధ్యమైంది?

క్షేత్రస్థాయి హెల్త్​ కేర్​ వర్కర్లుగా విధులు నిర్వర్తిస్తున్న అంగన్​వాడీ, ఆశాలు,ఏఎన్​ఎంలు గర్భిణీలపై ప్రత్యేక ఫోకస్​పెట్టడంతోనే ఇది సాధ్యమైనట్టు ఎస్​ఆర్​ఎస్​ రిపోర్టులో వెల్లడించారు. మహిళ గర్భం దాల్చిన వెంటనే వారి వివరాలను సేకరించి డెలివరీ వరకు మానిటరింగ్​ చేస్తున్నారు. 9 నెలల కాలంలో వాడాల్సిన మందులు, టీకాలను సకాలంలో ఇస్తున్నారు. దీంతో పాటు ప్రతీ నెల దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో చెకప్​ లు చేయిస్తున్నారు. గర్భిణీ ఆరోగ్యంతో పాటు కడుపులోని బిడ్డ హెల్త్​ పరిస్థితిపై కూడా స్కానింగ్‌ లు చేస్తూ పర్యవేక్షిస్తున్నారు. ఒక వేళ హైరిస్క్‌ కేసుగా ఉండే సదరు గర్భిణీలను జిల్లా, హైదరాబాద్​ లోని నిలోఫర్​, గాంధీ తదితర పెద్దాసుపత్రులకు రిఫర్​ చేస్తున్నారు. దీంతో పాటు గర్భిణి కాన్పు సమయంలో ఏఎన్‌ఎం, ఆశ వర్కర్లు దగ్గరుండి ధైర్యాన్ని కల్పిస్తున్నారు. కాన్పు అయ్యేవరకు అక్కడే ఉంటూ సురక్షితంగా 102 వాహనంలో ఇంటికి చేర్చుతున్నారు. మరోవైపు బిడ్డ పుట్టగానే టీకాలు వేస్తున్నారు. దీంతో బిడ్డలు సురక్షితంగా ఉంటున్నారు. ఏడాది వరకు క్రమం తప్పకుండా టీకాలు పొందేలా తల్లిదండ్రులకూ అవగాహన కల్పిస్తున్నారు.

కొన్ని చోట్ల నిర్లక్ష్యం…

కొన్ని ప్రాంతాల్లో వైద్యులు, సిబ్బంది, ఏఎన్‌ఎంల నిర్లక్ష్యం కారణంగా గర్భిణులు ఇంకా సమస్యలను ఎదుర్కొంటున్నారు. కాన్పు సమయంలో గర్భిణికి రక్తం లేదని, బిడ్డ అడ్డం తిరిగిందని, ఆపరేషన్​ చేసేవారు లేరని, ఆపరేషన్‌ చేయడానికి మత్తు సూది ఇచ్చేవారు లేరంటూ సర్కారు ఆసుపత్రికి వచ్చిన గర్భిణులను ప్రైవేట్​కు పంపుతున్నారు. ఆలస్యం చేస్తే తల్లీబిడ్డ ప్రాణాలకే ముప్పు ఉందని భయాందోళనకు గురి చేస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక చాలా మంది ప్రైవేట్​ కు పరుగులు పెడుతున్నారు.

ముఖ్యమైన రాష్ట్రాల్లో ఐఎంఆర్​ ఇలా

రాష్ట్రం 2018 2019
తెలంగాణ 27 23
మధ్యప్రదేశ్​ 48 46
ఆంధ్రప్రదేశ్​ 29 25
అస్సాం 41 40
ఢిల్లీ 13 11
గుజరాత్​ 28 25
కేరళ 7 6
తమిళనాడు 27 23
కర్ణాటక 23 21
మహారాష్ట్ర 19 17
బీహార్​ 32 29

Tags:    

Similar News