రంగంలోకి దిగిన రేవంత్.. ఆగస్టు 9న లక్ష మందితో భారీ ప్లాన్..

దిశ, తెలంగాణ బ్యూరో : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో వచ్చేనెల 9వ తేదీన లక్షమందితో దళిత, గిరిజన దండోరా సభను నిర్వహించనున్నట్లు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ చిరాన్ పోర్ట్ క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశానికి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ పగ్గాలు చేపట్టాక తొలిసారి ఏఐసీసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ […]

Update: 2021-07-25 07:38 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో వచ్చేనెల 9వ తేదీన లక్షమందితో దళిత, గిరిజన దండోరా సభను నిర్వహించనున్నట్లు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ చిరాన్ పోర్ట్ క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశానికి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలు ఆయనకు ఘనస్వాగతం పలికారు.

టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ పగ్గాలు చేపట్టాక తొలిసారి ఏఐసీసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రేమ్ సాగర్‌కు తనకు మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి నుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కదం తొక్కుతామని ఆయన ప్రకటించారు.

ఈ సభకు ప్రేమ్ సాగర్ రావు నాయకత్వం వహించాలని తెలిపారు. అనంతరం ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చితీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సురేఖ, జాతీయ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్, మహిళా కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

Tags:    

Similar News