బిగ్ న్యూస్.. మంత్రి మల్లారెడ్డి అక్రమాలు బయటపెట్టిన రేవంత్ రెడ్డి

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఘాటు సమాధానం ఇచ్చారు. శుక్రవారం గాంధీభవన్‌లో మీడియా సమక్షంలో మల్లారెడ్డి అక్రమాలు బయటపెడుతున్నానని రేవంత్ చెప్పుకొస్తూ.. 50 ఎకరాల లేఔట్ చేసిన వ్యాపారిని మల్లారెడ్డి బెదిరించినట్టు ఆడియోలు వచ్చాయన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్న ఆడియోలు కూడా బయటకు వచ్చాయని చెప్పారు. కానీ, సీఎం కేసీఆర్ మాత్రం విచారణకు ఆదేశాలు ఇవ్వలేదని విమర్శించారు. గుండ్ల పోచమ్మపల్లి ఊర్లో 2000-01 పహానిలో విభజన తర్వాత 22 ఎకరాలు […]

Update: 2021-08-27 05:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఘాటు సమాధానం ఇచ్చారు. శుక్రవారం గాంధీభవన్‌లో మీడియా సమక్షంలో మల్లారెడ్డి అక్రమాలు బయటపెడుతున్నానని రేవంత్ చెప్పుకొస్తూ.. 50 ఎకరాల లేఔట్ చేసిన వ్యాపారిని మల్లారెడ్డి బెదిరించినట్టు ఆడియోలు వచ్చాయన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్న ఆడియోలు కూడా బయటకు వచ్చాయని చెప్పారు. కానీ, సీఎం కేసీఆర్ మాత్రం విచారణకు ఆదేశాలు ఇవ్వలేదని విమర్శించారు.

గుండ్ల పోచమ్మపల్లి ఊర్లో 2000-01 పహానిలో విభజన తర్వాత 22 ఎకరాలు ఉన్న భూమి.. ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత 33 ఎకరాల 26 గుంటలు ఎలా అయ్యిందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఒకే సర్వే నెంబర్‌లో భూమి ఎలా పెరిగిందని.. 16 ఎకరాల భూమి శ్రీనివాస్ రెడ్డి పేరుతో బదిలీ అయిందని రేవంత్ పత్రాలు చూపించారు. అలాంటి భూమికి మల్లారెడ్డి బావమరిది యజమాని ఎలా అయ్యారని.. అందుకు ఆధారాలు ఏమీ లేవన్నారు. ఆ భూమి మల్లారెడ్డికి గిఫ్ట్ డీడ్ అయిందన్నారు. మల్లారెడ్డి అక్రమాలు బయటపెట్టిన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ విచారణకు ఆదేశాలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Tags:    

Similar News