బిగ్ బ్రేకింగ్: 'కేటీఆర్ సన్నిహితులకు డ్రగ్స్ నోటీసులు'
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర మంత్రి కేటీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో కేటీఆర్ గోవాకు వెళ్లి వచ్చారని, ఈ గోవా పర్యటన అధికారికమా.. అనధికారికమా అని ప్రశ్నించారు. శుక్రవారం గాంధీభవన్‌లో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గత నాలుగైదు రోజులుగా మంత్రి కేటీఆర్ ఆందోళనగా ఉన్నారని, ఆయన స్నేహితులకు డ్రగ్స్ కేసులో ఈడీ నోటీసులు ఇచ్చిందన్నారు. ఆయన సన్నిహితులకు నోటీసులు రావడంతో కేటీఆర్ భయపడుతున్నారన్నారు. తాను కూడా దీనిపై హైకోర్టులో […]
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర మంత్రి కేటీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో కేటీఆర్ గోవాకు వెళ్లి వచ్చారని, ఈ గోవా పర్యటన అధికారికమా.. అనధికారికమా అని ప్రశ్నించారు. శుక్రవారం గాంధీభవన్‌లో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గత నాలుగైదు రోజులుగా మంత్రి కేటీఆర్ ఆందోళనగా ఉన్నారని, ఆయన స్నేహితులకు డ్రగ్స్ కేసులో ఈడీ నోటీసులు ఇచ్చిందన్నారు. ఆయన సన్నిహితులకు నోటీసులు రావడంతో కేటీఆర్ భయపడుతున్నారన్నారు. తాను కూడా దీనిపై హైకోర్టులో ఈడీ, సీబీఐలను సవాల్ చేస్తూ పిల్ వేశానని, ప్రభుత్వం విచారణకు సహకరించడం లేదని ఈడీ కౌంటర్ దాఖలు చేసిందని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. మంత్రిగా కేటీఆర్ గోవా పర్యటనను ఎందుకు దాచిపెడుతున్నారని ప్రశ్నించారు. డ్రగ్స్ కేసులో విచారణ చేస్తామని ఈడీ, సీబీఐ అంటుంటే ప్రభుత్వం ఎందుకు తిరస్కరిస్తుందన్నారు.