కరోనా పూర్వస్థాయికి చేరుకున్న దేశీయ రిటైల్ పరిశ్రమ!

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ రిటైల్ పరిశ్రమ ఫిబ్రవరిలో కరోనాకు ముందుస్థాయిలో 93 శాతం అమ్మకాలను సాధించి, పూర్తిస్థాయిలో కోలుకుంటోందని ఓ నివేదిక తెలిపింది. 2021, ఫిబ్రవరిలో వినియోగ వస్తువులు 15 శాతం, క్విక్ సర్వీస్ రెస్టారెంట్ 18 శాతం వృద్ధిని సాధించాయని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(రాయ్) నివేదిక వెల్లడించింది. రిటైల్ అమ్మకాల్లో పెరుగుదల పరిమాణం తగ్గింది. ‘రిటైల్ రంగంలోని చాలా విభాగాలు గణనీయమైన మెరుగుదలను నమోదు చేశాయి. ఫుట్‌వేర్, బ్యూటీ, ఆరోగ్య-వ్యక్తిత రక్షణ వస్తువులు, క్రీడా […]

Update: 2021-03-16 09:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ రిటైల్ పరిశ్రమ ఫిబ్రవరిలో కరోనాకు ముందుస్థాయిలో 93 శాతం అమ్మకాలను సాధించి, పూర్తిస్థాయిలో కోలుకుంటోందని ఓ నివేదిక తెలిపింది. 2021, ఫిబ్రవరిలో వినియోగ వస్తువులు 15 శాతం, క్విక్ సర్వీస్ రెస్టారెంట్ 18 శాతం వృద్ధిని సాధించాయని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(రాయ్) నివేదిక వెల్లడించింది. రిటైల్ అమ్మకాల్లో పెరుగుదల పరిమాణం తగ్గింది. ‘రిటైల్ రంగంలోని చాలా విభాగాలు గణనీయమైన మెరుగుదలను నమోదు చేశాయి. ఫుట్‌వేర్, బ్యూటీ, ఆరోగ్య-వ్యక్తిత రక్షణ వస్తువులు, క్రీడా వస్తువులు, ఆహారం, కిరాణా వంటి నెలవారీ విభాగాలు స్థిరమైన రికవరీని సాధించాయి. 2021, మొదటి ఆరునెలల్లో కరోనా ముందుస్థాయి అమ్మకాలను తిరిగి సాధించగలమనే నమ్మకాన్ని చిల్లర వర్తకులు కలిగి ఉన్నారని రాయ్ సీఈఓ కుమార్ రాజగోపాలన్ చెప్పారు. తమ పరిశ్రమ కోలుకోవడం సంతోషంగా ఉంది. అయితే, కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ఆందోళన ఉన్నప్పటికీ, కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతున్న క్రమంలో రిటైల్ పరిశ్రమ వృద్ధిని అడ్డుకోదని ఆశిస్తున్నట్టు ఆయన వెల్లడించారు.

Tags:    

Similar News