దిగొచ్చిన రిటైల్ ద్రవ్యోల్బణం
దిశ, వెబ్‌డెస్క్: కూరగాయల ధరలు బాగా పడిపోవడంతో వినియోగదారు ద్రవ్యోల్బణం గతేడాది డిసెంబర్‌లో 4.59 శాతానికి తగ్గింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. రిటైల్ ధరల ద్రవ్యోల్బణం (సీపీఐ) గతేడాది మార్చిలో నమోదైన 5.84 శాతం తర్వాత ఇదే అతి తక్కువ నమోదు. గత తొమ్మిది నెలల్లో మొదటిసారి ఆర్‌బీఐ లక్ష్యం 2-6 శాతం మధ్య ద్రవ్యోల్బణ రేటు నమోదవడం గమనార్హం. 2020, నవంబర్‌లో ద్రవ్యోల్బణం 6.93 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఆహార ద్రవ్యోల్బణం డిసెంబర్‌కు […]
దిశ, వెబ్‌డెస్క్: కూరగాయల ధరలు బాగా పడిపోవడంతో వినియోగదారు ద్రవ్యోల్బణం గతేడాది డిసెంబర్‌లో 4.59 శాతానికి తగ్గింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. రిటైల్ ధరల ద్రవ్యోల్బణం (సీపీఐ) గతేడాది మార్చిలో నమోదైన 5.84 శాతం తర్వాత ఇదే అతి తక్కువ నమోదు. గత తొమ్మిది నెలల్లో మొదటిసారి ఆర్‌బీఐ లక్ష్యం 2-6 శాతం మధ్య ద్రవ్యోల్బణ రేటు నమోదవడం గమనార్హం. 2020, నవంబర్‌లో ద్రవ్యోల్బణం 6.93 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఆహార ద్రవ్యోల్బణం డిసెంబర్‌కు సంబంధించి 3.41 శాతానికి తగ్గిందని, అంతకుముందు నవంబర్‌లో 9.5 శాతంగా ఉందని గణాంకాలు తెలిపాయి.