చెరువుల్లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై ఆంక్షలు

దిశ, తెలంగాణ బ్యూరో : వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన ప్లాస్టర్-ఆఫ్-పారిస్ గణపతి విగ్రహాల నిమజ్జనంపై పొల్యూషన్ డిపార్ట్ మెంట్ ఆంక్షలు విధించింది. హుస్సేన్ సాగర్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న సహజ చెరువుల్లో నిమజ్జనం చేయొద్దని కాలుష్య నియంత్రణ మండలి సభ కార్యదర్శి నీతూప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ఆదేశించిందని ఆమె పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాలను గౌరవించాలని, పర్యావరణ పరిరక్షణ దిశగా వినాయక విగ్రహాల నిమజ్జనం […]

Update: 2021-09-11 07:54 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన ప్లాస్టర్-ఆఫ్-పారిస్ గణపతి విగ్రహాల నిమజ్జనంపై పొల్యూషన్ డిపార్ట్ మెంట్ ఆంక్షలు విధించింది. హుస్సేన్ సాగర్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న సహజ చెరువుల్లో నిమజ్జనం చేయొద్దని కాలుష్య నియంత్రణ మండలి సభ కార్యదర్శి నీతూప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ఆదేశించిందని ఆమె పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాలను గౌరవించాలని, పర్యావరణ పరిరక్షణ దిశగా వినాయక విగ్రహాల నిమజ్జనం జరగాలని నీతూప్రసాద్ ఆ ప్రకటనలో తెలిపారు.

Tags:    

Similar News