అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో బీజేపీ..
దిశ, వెబ్‌డెస్క్: రాజస్థాన్ రాజకీయాల్లో నెలకొన్న సందిగ్దత ఇప్పుడిప్పుడే ఓ కొలిక్కి వస్తుండగా, బీజేపీ ద్వారా గెహ్లాట్ ప్రభుత్వానికి మరో ప్రమాదం పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. శుక్రవారం నుంచి రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా, ప్రతిపక్ష బీజేపీ అధికార కాంగ్రెస్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీకి మద్దతుగా,.. అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్‌కు వ్యతికేరంగా ఓటు వేయాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి తన ఆరుగురు ఎమ్మెల్యేలకు విప్ జారీచేసింది. విశ్వాసపరీక్షను ఓ […]
దిశ, వెబ్‌డెస్క్: రాజస్థాన్ రాజకీయాల్లో నెలకొన్న సందిగ్దత ఇప్పుడిప్పుడే ఓ కొలిక్కి వస్తుండగా, బీజేపీ ద్వారా గెహ్లాట్ ప్రభుత్వానికి మరో ప్రమాదం పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. శుక్రవారం నుంచి రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా, ప్రతిపక్ష బీజేపీ అధికార కాంగ్రెస్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీకి మద్దతుగా,.. అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్‌కు వ్యతికేరంగా ఓటు వేయాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి తన ఆరుగురు ఎమ్మెల్యేలకు విప్ జారీచేసింది.
విశ్వాసపరీక్షను ఓ అవకాశంగా మలుచుకుని బలనిరూపణ చేసుకోవాలని సీఎం గెహ్లాట్ భావిస్తున్నట్లు సమాచారం. కాగా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో చర్చల అనంతరం రెబల్ ఎమ్మెల్యే సచిన్ పైలట్‌కు, సీఎం గెహ్లాట్ కు మధ్య సయోధ్య కుదిరింది. దీంతో ఆయన వర్గం ఎమ్మెల్యేలపై విధించిన సస్పన్షన్‌ను స్పీకర్ ఎత్తివేశారు. ఈ క్రమంలోనే ఇవాళ గెహ్లాట్ ఇంట్లో జరిగిన సీఎల్పీ సమావేశానికి సచిన్ పైలట్ హాజరయ్యారు. మొత్తానికి కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు ప్రస్తుతానికి సర్దుమనిగిన.. విశ్వాస పరీక్షలో నెగ్గి గెహ్లాట్ తన కుర్చీని కాపాడుకుంటారా, చేజార్చుకుంటారా అనే తేలనుంది.