తెలంగాణ యూనివర్సిటీలో సమస్యలు పరిష్కరించాలి: AISF
దిశ, నిజామాబాద్ అర్బన్: తెలంగాణ యూనివర్సిటీలో సమస్యలు పరిష్కరించాలని.. అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ శివ శంకర్‌కు బుధవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురాం మాట్లాడుతూ.. తెలంగాణ యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని, విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు. కోర్స్ బోర్డు ఏర్పాటు చేయాలని, ఆడిటోరియం నిర్వహించాలని, ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఏర్పాటు చేయాలని, విద్యార్థినిలకు అనుగుణంగా బాలికల (ఒకటి) హాస్టల్ భవనాన్ని […]
దిశ, నిజామాబాద్ అర్బన్: తెలంగాణ యూనివర్సిటీలో సమస్యలు పరిష్కరించాలని.. అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ శివ శంకర్‌కు బుధవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురాం మాట్లాడుతూ.. తెలంగాణ యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని, విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు. కోర్స్ బోర్డు ఏర్పాటు చేయాలని, ఆడిటోరియం నిర్వహించాలని, ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఏర్పాటు చేయాలని, విద్యార్థినిలకు అనుగుణంగా బాలికల (ఒకటి) హాస్టల్ భవనాన్ని నిర్మించాలన్నారు. ఆర్ట్స్, సైన్స్ భవనాలను వేరు వేరుగా నిర్మించాలని, ప్రొఫెసర్లకు క్వార్టర్స్ నిర్మించాలన్నారు. సమస్యలప్తె రిజిస్ట్రార్ వెంటనే స్పందించి పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షురాలు అంజలి, తెలంగాణ యూనివర్సిటీ కన్వీనర్ మురళి, నాయకులు సాయి, ఆదిత్య గౌడ్ వంశీ, శ్రీకాంత్, నవీన్ తదితరులున్నారు.