జీతాలిప్పించండి..ప్లీజ్.. జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ కు వినతి

దిశ, సిటీ బ్యూరో : శివార్లలో సీవరేజీ పనులు చేస్తున్న కార్మికులకు నాలుగు నెలలుగా బల్దియా జీతాలు చెల్లించటం లేదని, వెంటనే ఇప్పించేలా చర్యలు చేపట్టాలని కార్మికులు, బీజేపీ సిటీ మజ్దూర్ మోర్చా చైర్మన్ ఊదరి గోపాల్ జాతీయ సఫాయి కర్మచారి సభ్యురాలు అంజనా పన్వర్ ను కలిసి మొరబెట్టుకున్నారు. గతంలో జలమండలి పరిధిలోనే పని చేస్తున్న దాదాపు 650 మంది కార్మికులను కొంతకాలం క్రితం బల్దియా పరిధిలోకి మార్చారని వివరించారు. అంతకు ముందు జలమండలి పరిధిలో […]

Update: 2021-08-12 12:13 GMT

దిశ, సిటీ బ్యూరో : శివార్లలో సీవరేజీ పనులు చేస్తున్న కార్మికులకు నాలుగు నెలలుగా బల్దియా జీతాలు చెల్లించటం లేదని, వెంటనే ఇప్పించేలా చర్యలు చేపట్టాలని కార్మికులు, బీజేపీ సిటీ మజ్దూర్ మోర్చా చైర్మన్ ఊదరి గోపాల్ జాతీయ సఫాయి కర్మచారి సభ్యురాలు అంజనా పన్వర్ ను కలిసి మొరబెట్టుకున్నారు. గతంలో జలమండలి పరిధిలోనే పని చేస్తున్న దాదాపు 650 మంది కార్మికులను కొంతకాలం క్రితం బల్దియా పరిధిలోకి మార్చారని వివరించారు. అంతకు ముందు జలమండలి పరిధిలో పని చేసిన ఈ కార్మికులకు అక్కడి కాంట్రాక్టర్లు అరకోరగా జీతాలు చెల్లించి, వారి శ్రమను దోచుకునే వారని కమిషన్ దృష్టికి తీసుకువచ్చినట్లు ఊదరి గోపాల్ వివరించారు. వీరిని మళ్లీ వచ్చే నెల 1వ తేదీ నుంచి జలమండలి పరిధిలోకి తీసుకుంటున్నట్లు ఇటీవలే మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని కమిషన్‌కు తెలిపారు.

వీరిని బల్దియాలోనే కొనసాగేలా చర్యలు చేపట్టాలని కోరారు. జలమండలిలో కాంట్రాక్టర్లు వీరి కష్టానికి తగిన ప్రతిఫలం చెల్లించటం లేదని ఆరోపించారు. రూ.17 వేల జీతం చెల్లించాల్సి ఉండగా, జలమండలిలోని కాంట్రాక్టర్లు కేవలం రూ. 9వేల నుంచి 12 వేల మధ్య జీతాలను చెల్లిస్తూ వారి శ్రమను దోచుకుంటున్నారని కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. ఇప్పటికీ కూడా నాలుగు నెలలుగా జీతాలు చెల్లించటం లేదని, వెంటనే జీతాలు చెల్లించేలా కమిషన్ ఆదేశాలివ్వాలని కోరగా, సభ్యురాలు అంజనా పన్వర్ సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. ఈ కార్మికులను జలమండలి పరిధిలోకి తీసుకువస్తే వీరికి మళ్లీ అరకొరగా జీతాలు చెల్లించి, తామెక్కువ మొత్తంలో జేబులు నింపుకోవాలని కొందరు కాంట్రాక్టర్లు భావిస్తున్నారని గోపాల్ వెల్లడించారు.

స్వీపింగ్ మాకు.. మిషన్లు వేరే వారికా?

మహానగరంలోని దాదాపు 9 వేల 13 కిలోమీటర్ల రోడ్లను అర్థరాత్రి నుంచే స్వీపింగ్ చేసే పనులు మేం నిర్వహిస్తుంటే, స్వీపింగ్ మిషన్లు వేరే వారికెలా కేటాయిస్తారని, దళిత కార్మికులకే స్వీపింగ్ మిషన్లను కేటాయించాలని కోరారు. దీనిపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ (జీహెచ్ఎంఈయూ) చార్మినార్ జోన్ నేతలు మల్లేశ్ ఇతరులు గురువారం జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ సభ్యురాలు అంజనా పన్వర్ ను కలిసి వినతిపత్రాన్ని సమర్పించినట్లు వెల్లడించారు. అర్థరాత్రి నడి రోడ్డుపై ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని దళిత కార్మికులు రోడ్ల ఊడుస్తుంటే, స్వీపింగ్ మిషన్లను మాత్రం పలువురు రాజకీయ నేతల, బల్దియా అధికారుల నేతల బినామీలకు కేటాయిస్తున్నారని, ఈ విధానానికి స్వస్తి పలికేలా ఆదేశాలివ్వాలని ఆమెను కోరినట్లు, ఇందుకు ఆమె సానుకూలంగా స్పందించినట్లు వారు వెల్లడించారు.

Tags:    

Similar News