ఆనందయ్య ఐడ్రాప్స్‌పై ఆయుర్వేద నిపుణుల కమిటీ నివేదిక

దిశ, వెబ్‌డెస్క్: ఆనందయ్య కంటిచుక్కల మందుపై ఆయుర్వేద నిపుణుల కమిటీ నివేదిక సమర్పించింది. కంటి చుక్కల మందు వల్ల దుష్ప్రభావాలు ఎక్కడా కన్పించలేదని నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది.మామూలుగా కళ్లలో వేసే మందు ప్రమాణాలు ఆనందయ్య ఐడ్రాప్స్‌లో లేవని కమిటీ వెల్లడించింది. స్టెరాయిడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చాక కంటిచుక్కల మందు వినియోగించాలా, వద్దా అన్న విషయం నిర్ధారిస్తామని కమిటీ నివేదికలో పేర్కొంది. అయితే ఇప్పటికే ఆనందయ్య కంటిచుక్కల మందు పంపిణీ చేసేందుకు అనుమతించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించిన […]

Update: 2021-06-03 06:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆనందయ్య కంటిచుక్కల మందుపై ఆయుర్వేద నిపుణుల కమిటీ నివేదిక సమర్పించింది. కంటి చుక్కల మందు వల్ల దుష్ప్రభావాలు ఎక్కడా కన్పించలేదని నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది.మామూలుగా కళ్లలో వేసే మందు ప్రమాణాలు ఆనందయ్య ఐడ్రాప్స్‌లో లేవని కమిటీ వెల్లడించింది. స్టెరాయిడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చాక కంటిచుక్కల మందు వినియోగించాలా, వద్దా అన్న విషయం నిర్ధారిస్తామని కమిటీ నివేదికలో పేర్కొంది. అయితే ఇప్పటికే ఆనందయ్య కంటిచుక్కల మందు పంపిణీ చేసేందుకు అనుమతించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News